మెగా భవితవ్యం.. వర్మ చేతుల్లో

మెగా భవితవ్యం.. వర్మ చేతుల్లో

పాపం నిహారిక.. కుటుంబంలో ఎంతో పోరాటం చేసి, ఎన్నో ఆశలతో కథానాయికగా అరంగేట్రం చేసింది. కానీ ఆమెకు ఇక్కడ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. తొలి సినిమా ‘ఒక మనసు’.. మలి చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’ దారుణమైన ఫలితాలందుకున్నాయి. ఇప్పుడు ‘సూర్యకాంతం’ అనే కథానాయిక ప్రాధాన్యమున్న సినిమా చేసింది. ఇందులో హీరోగా రాహుల్ విజయ్, మరో కథానాయికగా కొత్తమ్మాయి నటిస్తున్నప్పటికీ కథ ప్రధానంగా నిహారిక చుట్టూనే తిరుగుతుంది. తన చెల్లెలి కోసం వరుణ్  తేజ్ ఎంతో కష్టపడి ఈ సినిమా సెట్ చేశాడు. ఈ నెల 29నే ‘సూర్యకాంతం’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఐతే రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ దీనికి ఆశించిన స్థాయిలో బజ్ లేదు. ట్రైలర్ పర్వాలేదనిపించింది కానీ.. ప్రేక్షకుల్ని థియేటర్ల వైపు నడిపించేంత ఎగ్జైటింగ్‌గా అయితే లేదు. ఈ రోజుల్లో ఆషామాషీ సినిమాలేవీ కూడా జనాల్ని థియేటర్ల వైపు రప్పించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రేక్షకుల్ని లాగే ‘స్టార్’ ఆకర్షణ లేకపోవడం ఈ సినిమాకు మైనస్. ఐతే షార్ట్ ఫిలిమ్స్‌తో సత్తా చాటిన ప్రణీత్ ప్రేక్షకుల్ని అలరించే సినిమానే తీశాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందన్నది కీలకంగా మారింది. సినిమా బాగుందంటేనే వసూళ్లు వస్తాయి.

‘సూర్యకాంతం’కు ఉన్న పెద్ద ప్రతికూలత.. దీనికి పోటీగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజవుతుండటం. గత కొన్నేళ్లలో వర్మ ఎన్ని చెత్త సినిమాలు తీసినప్పటికీ.. వివిధ కారణాల వల్ల ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చింది. నిన్న ఈ చిత్రానికి టికెట్ల బుకింగ్స్ ఓపెన్ చేస్తే జనాలు ఎగబడి కొనేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల వేడి రాజుకున్న సమయంలోనే రిలీజవుతుండటం దీనికి కలిసొచ్చే అంశం. ఈ చిత్రానికి మంచి టాక్ వస్తే వసూళ్ల మోత మోగడం ఖాయం. ఆ పరిస్థితుల్లో ‘సూర్యకాంతం’కు చాలా కష్టమవుతుంది. ‘సూర్యకాంతం’ కూడా ఫ్లాప్ అయితే.. నిహారిక కెరీర్ దాదాపుగా క్లోజ్ అనుకోవచ్చు. కాబట్టి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టాక్‌ను బట్టి మెగా డాటర్ భవితవ్యం ఆధారపడి ఉందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English