నో డౌట్‌.. పవన్‌ మార్చేస్తాడు

నో డౌట్‌.. పవన్‌ మార్చేస్తాడు

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ఫోకసంతా చేస్తున్న సినిమా మీదనే. మరో రెండు రోజుల్లో త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా హైదరాబాద్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసేస్తాడట పవన్‌. ఆ తరువాత యురోప్‌ చెక్కేసి, అక్కడ ఒక లాంగ్‌ షెడ్యూల్‌లో పాల్గొంటాడు. అయిత ఈ మద్యలో మనోడు దర్శకుడు త్రివిక్రమ్‌కు ఒక ట్విస్టిచ్చాడని తెలుస్తోంది.

ఇప్పటివరకు ఈ సినిమా పేరు ‘అత్తారింటికి దారేది’ అంటూ పాపులర్‌ చేసిపాడేశారు.  కాని ఈ టైటిల్‌ గురించి సర్వత్రా విమర్శలే వినిపిస్తున్నాయి. ఎంత తెలుగుదనం కోరుకుంటే మాత్రం అసలు ఆ పేరేంటి బాబోయ్‌ అంటూ ఫ్యాన్స్‌కూడా గోలెట్టేశారు. ఎవరి అత్తారింటికి దారి బాబూ అంటూ పవన్‌ను ఎద్దేవే చేస్తున్నారు కొందరు. ఆ నోటా ఈ నోటా ఈ సెటైర్లన్నీ మొత్తానికి పవన్‌ చెవిన పడటంతో,  మనోడు ఇప్పుడు టైటిల్‌ మార్చేద్దామని త్రివిక్రమ్‌కు సూచించాడట. ఈ లెక్కన చూస్తే, ఖచ్చితంగా సినిమా టైటిల్‌ మారిపోనుందనే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు