సాయి ధరమ్‌ తేజ్‌ హ్యాపీస్‌

సాయి ధరమ్‌ తేజ్‌ హ్యాపీస్‌

వరుసగా అరడజను ఫ్లాప్‌ సినిమాల్లో నటించిన హీరోకి తన కొత్త చిత్రానికి కాస్త బజ్‌ వస్తే అంతకంటే కావాల్సిందేముంటుంది? ఇన్ని ఫ్లాప్‌ చిత్రాల తర్వాత అసలు చిత్రలహరి చిత్రానికి కనీస స్పందన వుండదని తేజ్‌ ఫిక్స్‌ అయిపోయాడట. కానీ అనూహ్యంగా ఈ చిత్రానికి విడుదలకి ముందే బిజినెస్‌ క్లోజ్‌ అయిపోయింది. అంతే కాకుండా ఈ చిత్రం పాటలు కూడా జనాన్ని ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రంలోని రెండు పాటలు విడుదల కాగా, రెండిటికీ మిలియన్‌కి పైగా వ్యూస్‌ దక్కాయి. క్రేజ్‌ వున్న హీరో సినిమాలోని పాటలకి లక్షల కొద్దీ వ్యూస్‌ వచ్చేయడం మామూలే కానీ ఇలా ఫ్లాపుల్లో వున్న హీరో సినిమా పాటలు వినాలని ఎవరూ అనుకోరు. ఈ పాటలు హిట్‌ అవడానికి దేవిశ్రీప్రసాద్‌ మెయిన్‌ రీజన్‌ అని చెప్పాలి. దేవి ఈమధ్య మెప్పించే పాటలు ఇవ్వలేకపోతున్నా కానీ అతని పాటలకి ఖచ్చితమైన వ్యూయర్‌షిప్‌, లిజనర్స్‌ వుంటారు. అలా చిత్రలహరి పాటలు ఆకర్షించడానికి దేవి బ్రాండ్‌ హెల్ప్‌ అవుతోంది. తన తదుపరి చిత్రాన్ని ఎలా ప్రమోట్‌ చేసుకోవాలా అని ఆందోళన పడిన సాయిధరమ్‌ తేజ్‌ ఇప్పుడు లభిస్తోన్న ఆదరణతో ఫుల్‌ ఖుషీ అయిపోతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English