రాజమౌళి న్యాయం చెయ్యగలడా?

రాజమౌళి న్యాయం చెయ్యగలడా?

రాజమౌళి చిత్రాల్లో హీరోయిన్లకి ఇంపార్టెన్స్‌ చాలా అరుదుగా దక్కుతుంది. బాహుబలి మినహా అతని సినిమాల్లో లేడీ క్యారెక్టర్స్‌కి ఇంపార్టెన్స్‌ వుండదు. హీరో సెంట్రిక్‌ థీమ్స్‌తో సినిమాలు తీసే రాజమౌళి ఈసారి ఒక్కరు కాకుండా ఇద్దరు మాస్‌ హీరోలని ఒక్కటి చేసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' తీస్తున్నాడు. ఒక హీరోకే తగినంత స్క్రీన్‌ టైమ్‌ కేటాయించడానికి తెగ ఆలోచించాలంటే ఇద్దరు హీరోలకి సమానమైన స్క్రీన్‌ టైమ్‌ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో రాజమౌళి తన సినిమాలో హీరోయిన్‌గా ఆలియా భట్‌ని తీసుకోవడం ఆశ్చర్యకరమే.

ఎందుకంటే ఆలియాకి గ్లామర్‌ తారగా కంటే మంచి పర్‌ఫార్మర్‌గా పేరుంది. రాజీ చిత్రానికి గాను అవార్డులన్నీ ఆమే గెలుచుకుంటోంది. ఏ చిత్రంలో అయినా అద్భుతమైన నటనతో కట్టి పడేసే ఆలియాకి ఇద్దరు మాస్‌ హీరోల మధ్య రాజమౌళి న్యాయం చేయగలడా? బాహుబలి దర్శకుడి చిత్రంలో నటించాలనే కోరికతోనే ఆలియా ఈ పాత్రని ఓకే చేసిందట. కరణ్‌ జోహార్‌ ఆమెకి కన్విన్స్‌ చేసాడని కూడా అంటారు. ఈ చిత్రంలో తన పాత్ర ఏమిటనేది కూడా ఆలియా అడగలేదట. అయితే ఆలియా హీరోయిన్‌ అయితే బాలీవుడ్‌ ఆడియన్స్‌ ఖచ్చితంగా గొప్ప పాత్రని ఆశిస్తారు. మరి తనకున్న పరిమితుల్లో ఆలియా లాంటి నటికి రాజమౌళి న్యాయం చేయగలడా అనేది చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English