దేవరకొండ వెర్సస్ సూర్య

దేవరకొండ వెర్సస్ సూర్య

తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరో సూర్య. ఒకప్పుడు అతడి ఊపు మామూలుగా ఉండేది కాదు. కానీ గత కొన్నేళ్లలో వరుస ఫ్లాపులతో సూర్య వెనుకబడిపోయాడు. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘గ్యాంగ్’ కూడా ఆడలేదు. దీని తర్వాత సూర్య కెరీర్లో చాలా గ్యాప్ వచ్చింది. ఏడాదికి పైగా అతడి నుంచి సినిమానే రాలేదు. అతడి రావాల్సిన కొత్త సినిమా ‘ఎన్జీకే’ (నంద గోపాల కృష్ణ). విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సూర్య-సెల్వ కాంబినేషనే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా మొదలై ఏడాది దాటింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పటిదాకా రిలీజవ్వలేదు.

కానీ సెల్వ సినిమాలు ఒక పట్టాన పూర్తి కావు. అతను పర్ఫెక్షన్ కోసం చాలా సమయం తీసుకుంటాడు. అందుకే ‘ఎన్జీకే’ వాయిదా పడింది. మధ్యలో సంక్రాంతి రిలీజ్ అన్నారు.  మళ్లీ వాయిదా పడింది. ఇలా పడి పడి చివరికి మే నెలాఖర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎట్టకేలకు దీని రిలీజ్ డేట్ ఖరారు చేశారు. మే 31న తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వేసవికి తమిళంలో షెడ్యూల్ అయిన భారీ చిత్రమిదే. దీనిపై అక్కడ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఐతే విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘డియర్ కామ్రేడ్’ అదే తేదీన నాలుగు భాషల్లో రిలీజవుతోంది. తమిళంలో సూర్యను ఢీకొట్టడం విజయ్‌కు ఇబ్బంది. అలాగే తెలుగులో విజయ్‌తో తలపడటం సూర్యకు సమస్య. మరి ఎవరు పైచేయి సాధిస్తారో చూాడాలి. ‘ఎన్జీకే’లో సూర్య సరసన సాయిపల్లవి, రకుల్ ప్రీత్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య యువ రాజకీయ నాయకుడి పాత్ర చేస్తున్నాడు. తమిళ సమకాలీన రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా నడిచేలా ఉంది. ఐతే తెలుగు ప్రేక్షకులకు ఇది ఏమాత్రం కనెక్టవుతుందన్నది సందేహమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English