తేజు చెప్పింది ఆ హీరోయిన్ గురించేనా?

తేజు చెప్పింది ఆ హీరోయిన్ గురించేనా?

ఈ రోజుల్లో ఒక నాలుగైదేళ్లు సినీ రంగంలో ఉంటే ఒక హీరో లేదా హీరోయిన్ గురించి ఎఫైర్ వార్తలు రాకుండా పోవు. అలాగే ఒక హీరో ఇంకో హీరోయిన్ వరుస బెట్టి రెండు మూడు సినిమాలు చేస్తే, వాళ్లిద్దరూ బయట కూడా క్లోజ్‌గా కనిపిస్తే ‘ఎఫైర్’ రూమర్లు వచ్చేస్తాయి. మెగా ఫ్యామిలీ యువ కథానాయకుడు సాయిదరమ్ తేజ్‌కు కూడా ఇలాగే ఒక కథానాయికతో సంబంధం అంటగట్టేశారు. ఆ కథానాయిక రెజీనా కసాండ్రా అని అందరికీ తెలుసు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’తో తొలిసారి జోడీ కట్టిన ఈ జోడీ.. ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’లోనూ కలిసి నటించింది. ఒక దశ వరకు వీళ్లిద్దరూ వ్యక్తిగతంగా కూడా సన్నిహితంగా కనిపించారు. కొన్ని సినిమా వేడుకల్లో వీళ్లిద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడిన తీరు.. ‘బాబు గారు’.. ‘పాప గారు’ అని ఒకరినొకరు సంబోధించుకున్న వైనం వీరి మధ్య ఏదో ఉందన్న అనుమానాలకు బలం చేకూర్చింది.

ఐతే ఈ ప్రచారం ఊపందుకోవడంతో అనుకోకుండా ఇద్దరి మధ్య దూరం వచ్చింది. తర్వాత కలిసి నటించలేదు. కలిసి కూడా కనిపించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తేేజు.. ఈ విషయంపై స్పందించాడు. రెజీనా పేరెత్తకుండా ఆమె గురించి మాట్లాడాడు. ''అప్పట్లో ఓ కథానాయికతో ఏవేవో రూమర్లు పుట్టించారు. అలాంటి ప్రచారాల వల్ల ఆ అమ్మాయి కెరీర్‌ నాశనం అవుతుందని భయపడి.. సీరియస్‌గా తీసుకోవాల్సివచ్చింది. అప్పటి నుంచీ తనతో దూరంగానే ఉన్నా. మా మధ్య స్నేహం పాడవడం ఇష్టం లేదు. ఆమె నా తొలి సినిమా హీరోయిన్‌. ఆమెపై నాకున్న గౌరవం ఎప్పటికీ ఉంటుంది. నా తొలి దర్శకుడు, నిర్మాత ఎంత స్పెషలో.. తనూ అంతే స్పెషల్‌. అందుకే కాస్త చనువుగా ఉండేవాడ్ని. అంతకు మించి ఏం లేదు'' అని తేజు చెప్పాడు.

తేజు రెజీనా పేరు చెప్పకపోయినా.. అతను మాట్లాడింది తన గురించే అన్నది స్పష్టం. మొత్తానికి ఈ రూమర్లకు భయపడి రెజీనాతో స్నేహాన్నే దూరం చేసుకున్నాడన్నమాట తేజు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English