హరీష్ శంకర్‌కు ఇక్కడెవరూ దొరకలేదా?

హరీష్ శంకర్‌కు ఇక్కడెవరూ దొరకలేదా?

‘దువ్వాడ జగన్నాథం’తో గట్టి షాకే తిన్నాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేసుకున్న హరీష్ శంకర్.. దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లందరినీ టార్గెట్ చేసుకున్నాడు. నెగెటివ్ రివ్యూలిచ్చిన మీడియా వాళ్లపై పడ్డాడు. ఐతే ముందు నుంచి సినిమాకు ఉన్న క్రేజ్ వల్ల దీనికి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. తర్వాత సినిమా నిలబడలేదు. ‘డీజే’ రిలీజైన రెండేళ్లకు కానీ తన కొత్త సినిమాను మొదలు పెట్టలేని స్థితికి చేరుకున్నాడు హరీష్. ఈసారి అతడికి పెద్ద స్టార్లెవ్వరూ దొరక్క వరుణ్ తేజ్‌తో సర్దుకుపోతున్నాడు. ‘డీజే’ ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజే అతడిని నమ్మలేదు. దీన్ని బట్టి ‘డీజే’ ఫలితమేంటన్నది ఒక అంచనాకు రావచ్చు. సొంత కథతో ఎవరినీ మెప్పించలేక తమిళంలో హిట్టయిన ‘జిగర్‌తండ’ను రీమేక్ చేస్తున్నాడు హరీష్.

తమిళంలో బాబీ సింహా చేసిన విలన్ పాత్రను తెలుగులో వరుణ్ తేజ్‌తో చేయించి సాహసానికి దిగుతున్నాడు హరీష్. అతను చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్నిస్తుందో అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. గతంలో ‘దబంగ్’ను ‘గబ్బర్ సింగ్’గా మలిచి పెద్ద హిట్టు కొట్టిన హరీష్ అదే కాన్ఫిడెన్సుతో ‘జిగర్ తండ’ను తన స్టయిల్లో రీమేక్ చేయడానికి తయారయ్యాడు. ఐతే వరుణ్‌ను విలన్‌గా చూపిస్తున్న హరీష్.. తమిళంలో సిిద్దార్థ్ చేసిన హీరో పాత్రకు ఇక్కడెవరూ దొరకనట్లుగా తమిళం నుంచి అధర్వను తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అధర్వ ఏమీ కార్తి లాగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని హీరో కాదు. అతను మంచి నటుడే కానీ.. ఆ మాత్రం యాక్ట్ చేయగల హీరోలు తెలుగులో లేకా కాదు.

అధర్వ మాత్రమే చేయాల్సిన పాత్ర అయితే అతడికి ఇవ్వొచ్చు. కానీ సిద్ధు చేసిన పాత్రను ఇక్కడి యువ కథానాయకులు చాలామంది చేయగలరు. ఈ సినిమా కోసం నాగశౌర్యను హీరోగా అనుకుంటున్నట్లు ఇంతకుముందు వార్తలొచ్చాయి. మరేమైందో తెలియదు కానీ.. అధర్వ పేరు వినిపిస్తోంది. అసలే తమిళ సినిమాను రీమేక్ చేస్తున్నారు.  పైగా వరుణ్ విలన్ అంటున్నారు. హీరోనేమో తమిళుడిని తెెచ్చిపెడితే పరిస్థితి ఏంటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English