దేవరకొండపై ఆయన అభిప్రాయం మారింది

దేవరకొండపై ఆయన అభిప్రాయం మారింది

విజయ్ దేవరకొండను మొదట చూసినపుడు ఎవరికైనా కొంచెం తేడాగానే అనిపిస్తుంది. ‘అర్జున్ రెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ మీద బూతు మాటలు మాట్లాడిన విజయ్‌ను చూసి ఇతనేదో బ్యాడ్ బాయ్ అన్న ఫీలింగ్ కలిగింది పెద్దోళ్లకి. కానీ అతడితో కలిసి పని చేసిన వాళ్లు మాత్రం విజయ్ చాలా మంచోడని అంటారు. లోపల ఏదో పెట్టుకుని బయటికి నటించే వాళ్లతో పోలిస్తే విజయ్ చాలా బెటర్ అని అంటారు అతడితో పని చేసిన వాళ్లు.

అల్లు అరవింద్ సైతం ఈ విషయంలో విజయ్‌కి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. బయటికి అల్లరోడిలా, యాటిట్యూడ్ ఉన్న వాడిలా కనిపిస్తాడు.. విజయ్ జెమ్ అంటూ ఆయన ఓ సందర్భంలో కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇదే తరహాలో మెగా బ్రదర్ నాగబాబు సైతం విజయ్ దేవరకొండతో నేరుగా పని చేశాక అతడిపై తన అభిప్రాయం మార్చుకున్నాడట.

ముందు నాగబాబుకు తనపై మంచి అభిప్రాయం లేనట్లు కనిపించిందని.. ఐతే ‘గీత గోవిందం’ సినిమాకు ఆయనతో కలిసి పని చేశాక తనపై అభిప్రాయం మారిందని విజయ్ తెలిపాడు. నాగబాబు తనయురాలు నిహారిక నటించిన ‘సూర్యకాంతం’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాగబాబు గారితో ‘గీత గోవిందం’ చేశాను. ఆయనతో పని చేస్తున్నపుడు మా నాన్నతో ఉన్న ఫీలింగ్ కలిగింది.

తొలి రోజు సెట్లో ఆయన నాతో ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత.. ‘ఏమో అనుకున్నాను కానీ నువ్వు మంచోడివేనయ్యా’ అన్నారు’’ అని విజయ్ తెలిపాడు. ఈ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే నాగబాబుకు ముందు విజయ్ మీద సదభిప్రాయం లేదని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే.. నిహారికతో విజయ్ పెళ్లి అంటూ ఈ మధ్య ఒక రూమర్ పుట్టించారు జనాలు. కానీ విజయ్ మాత్రం ఈ వేడుకలో మాట్లాడుతూ.. చరణ్, వరుణ్ అందుబాటులో లేకపోవడంతో నిహారికకు ఒక సోదరుడిలా ఈ వేడుకకు వచ్చానని చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English