తారక్ ప్రాణానికి నా ప్రాణం అడ్డు

తారక్ ప్రాణానికి నా ప్రాణం అడ్డు

ఆంప్రదేశ్‌లో ఎన్నికల వేడి బాగా రాజుకుంటున్న సమయంలో మంచు ఫ్యామిలీ అనూహ్యంగా వార్తల్లోకి వచ్చింది. తమ విద్యానికేతన్ కళాశాలకు ఏపీ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంపై మంచు మోహన్ బాబు విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయమై అటు ప్రభుత్వం, ఇటు మంచు ఫ్యామిలీ వైపు నుంచి వాదోపవాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు సాగుతున్నాయి.

మంచు ఫ్యామిలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమని.. అందుకే ఎన్నికల వేళ పరోక్షంగా తెదేపా సర్కారును ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తోందని తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో మంచు మనోజ్ తాను జనసేన పార్టీ మద్దతుదారునని ప్రకటించుకోవడం గమనార్హం.

ఈ ఎన్నికల్లో తాను జనసేనకే మద్దతు తెలియజేస్తానని.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మనోజ్ అన్నాడు. ఈ విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వాలని ఓ అభిమాని అడగ్గా.. తాను పక్కాగా జనసేనకు మద్దతు ఇస్తున్నట్లు మనోజ్ చెప్పడం విశేషం. తెలుగుదేశం పార్టీతో మంచు ఫ్యామిలీ కయ్యం నడుస్తున్న సమయంలో.. ఆ పార్టీని ఎన్నికల్లో ఢీకొంటున్న పవన్ పార్టీకి మనోజ్ జై కొట్టడం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ గురించి చాలా సానుకూలంగా మాట్లాడుతూ.. అతను రాజకీయాల్లోకి వస్తే తన వెంటే నడుస్తానని మనోజ్ చెప్పడం విశేషం. ఓ 5-10 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు తోడుగా ఉంటావా అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘‘తారక్ వస్తే ఇక నేను ఎటు వెళ్తాను తమ్ముడూ. నా మిత్రుడి రాక కోసం ఎదురుచూస్తున్నాం. తారక్ ప్రాణానికి నా ప్రాణం అడ్డు’ అని మనోజ్ పేర్కొన్నాడు. ఓవైపు పవన్‌కు, మరోవైపు ఎన్టీఆర్‌కు మనోజ్ జై కొట్టి జనాల్ని కన్ఫ్యూజన్లో పెట్టేశాడు మంచు వారబ్బాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English