వరుణ్‌ తేజ్‌ డామినేషన్‌ని ఎవరూ ఒప్పుకోలేదు

వరుణ్‌ తేజ్‌ డామినేషన్‌ని ఎవరూ ఒప్పుకోలేదు

వరుణ్‌ తేజ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'వాల్మీకి' తమిళంలో వచ్చిన 'జిగరతండ' చిత్రానికి రీమేక్‌ అనేది తెలిసిందే. ఇందులో వరుణ్‌ తేజ్‌ హీరోగా కాకుండా ఒరిజినల్‌లో బాబీ సింహా చేసిన విలన్‌ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో అసలు కథలోని హీరో పాత్ర (సిద్ధార్థ్‌ చేసాడు) పరిధి తగ్గించి, వరుణ్‌ తేజ్‌ని ఎలివేట్‌ చేస్తూ హరీష్‌ శంకర్‌ కథ రాసాడు. వరుణ్‌ తేజ్‌తో విలన్‌ పాత్ర చేయించి, అసలు హీరో పాత్రని వేరే ఎవరైనా యువకుడితో చేయించాలని చూసారు.

కానీ తెలుగు యువ హీరోలు ఎవరూ అసలు ప్రాధాన్యత లేని ఆ పాత్రలో నటించడానికి అంగీకరించలేదు. వరుణ్‌ తేజ్‌ క్యారెక్టర్‌ ఫుల్‌ డామినేటింగ్‌గా వుండడంతో వాల్మీకిలో నటించినా తమకి ఎలాంటి గుర్తింపు రాదని భావించారు. హరీష్‌ శంకర్‌కి తెలుగు హీరోల నుంచి సమ్మతం రాకపోవడంతో తమిళ యువ నటుడు అధర్వ మురళితో ఆ పాత్ర చేయిస్తున్నాడు. అధర్వ అసలు మనవారికి తెలియని వాడు కనుక ఇక వరుణ్‌ తేజ్‌ని ఎంతయినా ఎలివేట్‌ చేసుకోవచ్చు. ఈ చిత్రం తమిళంలోకి అనువాదమయ్యే అవకాశం కూడా లేదు కనుక తన పాత్ర నిడివి ఎంత అయినా అధర్వకి కూడా అంతగా పట్టింపులు లేవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English