నాని చొక్కా చౌక కాదండోయ్‌!

 నాని చొక్కా చౌక కాదండోయ్‌!

మిడిల్‌ ఏజ్డ్‌ క్రికెటర్‌గా నాని నటిస్తోన్న 'జెర్సీ' ఇప్పటికే మంచి బజ్‌ తెచ్చుకుంది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్‌కి సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. రొటీన్‌ సినిమాలు చేస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్న నాని ఈసారి పంథా మార్చి ఒక ఎమోషనల్‌ స్పోర్ట్స్‌ డ్రామాతో వస్తున్నాడు.

ఇటీవల అతను నటించిన చిత్రాలు ఫ్లాప్‌ అయినా కానీ జెర్సీకి మాత్రం మంచి రేటు పలికింది. కృష్ణార్జున యుద్ధం, దేవదాస్‌ ఫలితాలు దీనిని ప్రభావితం చేయలేదు. ఈ చిత్రం థియేట్రికల్‌ బిజినెస్‌ 31 కోట్ల వరకు జరిగిందని అంచనా. ఒక స్పోర్ట్స్‌ డ్రామాకి ఇది చాలా పెద్ద అమౌంటే. అందులోను నాని ఫ్లాపుల్లో వుండగా ఈ రేటు పలికిందంటే అతనిపై మార్కెట్‌ వర్గాల్లో వున్న నమ్మకం ఏమిటనేది తెలుస్తోంది.  

ఈ చిత్రానికి నాన్‌ థియేట్రికల్‌ హక్కులు మరో పదిహేను కోట్ల వరకు వస్తాయి. ఈ చిత్రానికి నాని పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా పద్ధతిలో చేస్తోన్న సంగతి తెలిసిందే. నాని రెమ్యూనరేషన్‌ లేకపోవడంతో ఈ చిత్రం బడ్జెట్‌ పాతిక కోట్ల లోపే అయింది. ఇప్పుడు ఈ బిజినెస్‌ లెక్కలు చూస్తే అటు నిర్మాతలకి, ఇటు నానికి కూడా జెర్సీతో బాగానే గిట్టుబాటు అయిన సంగతి తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English