మీడియాకి దూరంగా మెగా హీరోలు

మీడియాకి దూరంగా మెగా హీరోలు

ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో మీడియా బైట్స్‌ కోసం ఆవురావురుమంటూ వుంది. పవన్‌కళ్యాణ్‌ ఈసారి పోటీకి దిగడంతో మెగా హీరోల బైట్స్‌ కోసం మీడియా మరింతగా పాట్లు పడుతోంది. పవన్‌కళ్యాణ్‌కి మద్దతుగా మెగా హీరోలెవరూ మాట్లాడ్డం లేదు.

నాగబాబు కూడా జనసేనలో చేరినా కానీ మెగా హీరోల నుంచి చప్పుడే లేదు. బయట ఎక్కడ కనిపించినా జనసేన గురించి అడుగుతారని ఖాళీగా వున్న మెగా హీరోలు వేరే దేశాలకి హాలిడేకి వెళ్లిపోయారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు పబ్లిక్‌ ఈవెంట్స్‌లో కూడా కనిపించరాదని డిసైడ్‌ అయ్యారు. పబ్లిక్‌లో కనబడితే పవన్‌ ఫాన్స్‌తో తమ జై జనసేన అనిపిస్తారని, అది ఇతర రాజకీయ పక్షాలకు, అభిమానుల్లో ఇతర పార్టీల పక్షపాతులకు నచ్చదనే ఆలోచనతో జనసేన ఊసెత్తాల్సిన అవసరం లేకుండా మెగా హీరోలు పబ్లిక్‌కి మొహం చాటేసి తిరుగుతున్నారు.

అయితే సాయి ధరమ్‌ తేజ్‌ మాత్రం ఈ తాకిడి తప్పించుకునే అవకాశం లేదు. తన సినిమా ఏప్రిల్‌ 12న విడుదలవుతోంది కనుక ఆ చిత్రం ప్రచారం కోసమయినా తేజ్‌ బయటకి రావాల్సిందే. మరి పొలిటికల్‌ మేటర్స్‌ అడిగినపుడు తేజ్‌ ఎలా స్పందిస్తాడనేది చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English