‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఎన్టీఆర్ ఎవరంటే..?

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఎన్టీఆర్ ఎవరంటే..?

నిజ జీవిత కథలతో సినిమాలు తీస్తున్నపుడు ప్రధాన పాత్రధారుల కోసం కొత్త నటీనటులను ఎంచుకుని వాళ్లకు అదిరిపోయే మేకోవర్ ఇవ్వడంలో రామ్ గోపాల్ వర్మను మించిన వాడు మరొకరు కనిపించడు. కొన్నేళ్ల కిందట ‘కిల్లింగ్ వీరప్పన్’ కోసం సందీప్ భరద్వాజ్ అనే నటుడిని ఎంచుకుని.. వీరప్పన్ లాగా ఎలా మార్చాడో తెలిసిందే. ఇంకా చాలా సినిమాల్లో ఇలాగే కొన్ని పాత్రలకు అనామకులైన నటీనటుల్ని ఎంచుకుని వాళ్లను ట్రాన్స్‌ఫామ్ చేసి అచ్చం ఆయా వ్యక్తుల్ని చూస్తున్న భావనే కలిగించాడు.

తాజాగా ఆయన తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో సైతం ఎన్టీఆర్ పాత్రధారిని చూసి అందరూ షాకయ్యేలా చేయగలిగాడు వర్మ. ఓవైపు ‘యన్.టి.ఆర్’లో నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో కొన్ని చోట్ల చాలా ఎబ్బెట్టుగా కనిపించాడు కానీ.. వర్మ సినిమాలో ప్రధాన పాత్రధారి మాత్రం అచ్చంగా ఎన్టీఆర్‌‌లా కనిపించి ఔరా అనిపించాడు.

ఐతే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఎన్టీఆర్ పాత్ర చేసిన నటుడి పేరు మాత్రం ఇప్పటిదాకా వెల్లడి కాలేదు. ఆయన ఎవరు ఏంటన్నది వర్మ చెప్పలేదు. ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ ఈ విషయం వెల్లడించాడు. ఎన్టీఆర్ పాత్రధారి పేరు విజయ్ కుమార్ అట. అతను ఓ రంగస్థల నటుడట. విజయ్ కుమార్ రెండు నెలల పాటు తన దగ్గర తర్ఫీదు పొంది.. ఆ తర్వాత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా చేసినట్లు వర్మ వెల్లడించాడు. పేరున్న నటుడెవరైనా ఎన్టీఆర్ పాత్ర చేస్తే.. అందులో వాళ్లే కనిపిస్తారని.. కొత్త వాళ్లయితే ప్రేక్షకుడికి బిలీవబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందని వర్మ అన్నాడు.

ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల గురించి మాట్లాడుతూ.. సెన్సార్ బోర్డుతో సమాచార లోపం వల్లే కోర్టుకు వెళ్తానని అన్నానని.. నిజానికి సమస్య ఏమీ లేదని.. సినిమాకు సెన్సార్ పూర్తయిందని.. పక్కాగా ఈ నెల 29న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రేక్షకుల ముందుకు వస్తుందని.. రాజ్యాంగ హక్కుల్ని కాపాడే వ్యక్తిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సినిమాకు ఎలాంటి అడ్డంకులు కల్పించరని భావిస్తున్నానని వర్మ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English