పవన్‌ పార్టీకి 'చిత్రలహరి' పబ్లిసిటీ!

పవన్‌ పార్టీకి 'చిత్రలహరి' పబ్లిసిటీ!

కావాలని పెట్టారో లేక అలా కుదిరేసిందో తెలియదు కానీ 'గ్లాస్‌మేట్స్‌' అంటూ 'చిత్రలహరి'లో ఒక పాట పెట్టారు. గ్లాస్‌మేట్స్‌ అంటే సాధారణంగా మందుబాబులని గురించి అంటుంటారు. అయితే పవన్‌కళ్యాణ్‌ పార్టీ గుర్తు గాజు గ్లాస్‌, ఇంకా కరక్ట్‌గా చెప్పాలంటే టీ గ్లాస్‌ కావడంతో ఈ 'గ్లాస్‌మేట్స్‌' పాటని తెలివిగా జనసైనికులు కనక్ట్‌ అయ్యేలా ప్రమోట్‌ చేస్తున్నారు. ఈ సాంగ్‌ విడుదలకి సంబంధించిన పోస్టర్‌లో కూడా పవన్‌ పార్టీ గుర్తు హైలైట్‌ అవడం గమనార్హం. మరి ఈ పాటతో సరాసరి గ్లాస్‌కి ఓటేయమని అడుగుతారో లేక ఇన్‌డైరెక్టుగా గ్లాస్‌ని ప్రమోట్‌ చేస్తారో వీడియో చూస్తేనే కానీ తెలియదు.

రాజకీయాలకి దూరంగా వుంటున్నా కానీ సాయి ధరమ్‌ తేజ్‌కి చిన్న మేనమామ అంటే మక్కువ ఎక్కువే. అతడిని హీరోగా పరిచయం చేయాలని చూసింది కూడా పవన్‌ కళ్యాణే. వైవిఎస్‌ అతడిని రేయ్‌లో హీరోగా తీసుకున్నది కూడా పవన్‌ చెప్పడం వల్లే. మరిప్పుడు మావయ్యకి తన వంతు సహకారంగా ఇలా గ్లాస్‌మేట్స్‌ సాంగ్‌తో తేజు పబ్లిసిటీ చేస్తున్నాడనే అనుకోవాలా? ఇంటర్వ్యూలకి వచ్చినపుడు తేజ్‌ని మీడియా తప్పకుండా అడగాలీ ప్రశ్న.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English