డబ్బింగ్ సినిమా.. ఇదేం మూర్ఖత్వం?

డబ్బింగ్ సినిమా.. ఇదేం మూర్ఖత్వం?

అసలే అనువాద చిత్రాలకు తెలుగులో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు సైతం ఆదరణ దక్కట్లేదు. సూర్య సినిమాలకు కూడా మునుపటిలా క్రేజ్ కనిపించడం లేదు. సంవత్సరంలో ఒకట్రెండు అనువాదాలకు మించి ప్రభావం చూపట్లేదు. వేరే భాషల నుంచి వచ్చే సినిమాలకు రిలీజ్ ఖర్చులు రావడం కూడా కష్టంగా ఉంది. చాలా వరకు సినిమాల్ని మొక్కుబడిగా రిలీజ్ చేస్తున్నారు. వాటిని జనాలు అసలే పట్టించుకోవడం లేదు. ఇలాంటి స్థితిలో కొన్ని డబ్బింగ్ సినిమాలకు సరైన టైటిళ్లు పెట్టలేకపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

‘ఫిదా’ సినిమాతో తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సాయిపల్లవి తన మాతృభాషలో ‘అతిరన్’ అనే సినిమా చేసింది. ఫాహద్ ఫాజిల్ హీరో. ‘అతిరన్’ అనేది హీరో పేరు కావచ్చు. మలయాళంలో ‘అతిరన్’ అంటే ఏమర్థమో ఏమో కానీ.. తెలుగులో కూడా అదే టైటిల్ పెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ వదలడమేంటో అర్థం కావడం లేదు. తమిళం, మలయాళం పేర్ల వెనుక ‘న్’ వస్తుందన్న సంగతి తెలిసిందే. ఆ అక్షరం జోడిస్తే ఇక తెలుగు ఫీలింగ్ ఎలా వస్తుంది? ఇంతకుముందు విజయ్ ఆంటోనీ ‘యమన్’ అనే సినిమా చేశాడు. అదే పేరును తెలుగులోనూ కంటిన్యూ చేశాడు. ఇలాంటి టైటిల్ పెట్టడమంటే తెలుగు ప్రేక్షకుల్ని చులకనగా చూడటమే. ఇంతకుముందు రజనీకాంత్ సైతం ‘కబాలి’.. ‘కాలా’.. ‘పేట్ట’ అనే తమిళ టచ్ ఉన్న టైటిళ్లను యాజిటీజ్ తెలుగులోనూ పెట్టేసి మన ప్రేక్షకులు ఆ చిత్రాలను ఓన్ చేసుకోలేని పరిస్థితి కల్పించాడు. తెలుగుదనం ఉట్టిపడకపోయినా పర్వాలేదు కానీ.. పరభాషత్వాన్ని మనపై రుద్దాలనుకుంటే జనాలు ఈ సినిమాల పట్ల ఏమాత్రం ఆసక్తి చూపిస్తారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English