విజయ్ దేవరకొండ నైజాం సత్తా ఇదీ..

విజయ్ దేవరకొండ నైజాం సత్తా ఇదీ..

గత మూడేళ్లలో ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. ‘పెళ్ళిచూపులు’ అనే చిన్న సినిమాతో హీరోగా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్న అతను.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు. ఆపై ‘గీత గోవిందం’.. ‘ట్యాక్సీవాలా’ కూడా బ్లాక్ బస్టర్లు కావడంతో విజయ్ రేంజే మారిపోయింది. ఇప్పుడు అతడి కొత్త సినిమా ‘డియర్ కామ్రేడ్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే రిలీజైన దీని టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మే నెలాఖర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. దీనికి క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఒక్క నైజాం ఏరియాకే హక్కులు రూ.7.6 కోట్లు పలికాయట. దీన్ని బట్టి విజయ్ స్టార్ స్థాయిని కూడా దాటిపోతున్నాడని అర్థం చేసుకోవచ్చు.

విజయ్‌కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఉండగా.. నైజాంలో అతడి క్రేజ్ ఇంకా ఎక్కువ. మిగతా ఏరియాల్లో కూడా ఇదే రేంజిలో బిజినెస్ జరిగితే.. తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులే రూ.30 కోట్లకు పైగా తెచ్చి పెట్టే అవకాశముంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. కాబట్టి మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ.60 కోట్ల దాకా ఉండొచ్చు. శాటిలైట్, డిజిటల్ బిజినెస్ కూడా కలుపుకుంటే లెక్క భారీగానే ఉండే అవకాశముంది. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే ‘గీత గోవిందం’ తర్వాత మరోసారి విజయ్ వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు భరత్ కమ్మ రూపొందించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English