అల్లరి 3డి - అన్నీ ఎక్స్‌ట్రాలే

 అల్లరి 3డి - అన్నీ ఎక్స్‌ట్రాలే

తెలుగు ప్రేక్షకులను అలరించడానికి నేనంటే నేను అంటూ రెండు 3డి సినిమాలు పోటీపడుతున్నాయ్‌. ఒకటి కల్యాణ్‌రామ్‌ తీస్తున్న ఓమ్‌ 3డి కాగా, మరొకటి అల్లరి నరేష్‌ హీరోగా రూపొందిన యాక్షన్‌ 3డి. అయితే కల్యాణ్‌రామ్‌ సినిమా ట్రైలర్‌ను బట్టి సినిమా యావత్తు సూపర్‌ రివెంజ్‌ డ్రామా అని తెలుస్తోంది. ఇక్క అల్లరిబాబు సినిమాకు వస్తే మాత్రం, ఇది యాక్షన్‌ సినిమానా, కామెడి సినిమానా, చిన్న పిల్లల సినిమానా, లేకపోతే స్నేహా ఉల్లాల్‌ లాంటి భామల అందాలను పిండేసిన సెక్సీ మూవీనా అనేది తెలియడంలేదు. పైగా ఈ సినిమాలో ఒక చింపాంజి ఒక పులి యాక్ట్‌ చేసాయంటూ నిర్మాతలు కామెడి చేస్తున్నారు.

ఇవి కాకుండా పోసాని కృష్ణమురళి ఒకవైపు, సిక్స్‌ప్యాక్‌  హీరో సునీల్‌ ఒకవైపు ఇరగదీస్తున్నారని మరో న్యూస్‌. అసలు 3డి లో  సీరియస్‌గా సినిమా తీస్తున్నవారు ఇలా ఇన్ని ఎక్స్‌ట్రా ఫిట్టింగులను ఎందుకు అమరుస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే అల్లరి నరేష్‌ సినిమా అంటే ఖచ్చితంగా దాంట్లో ఆ మాత్రం అతి ఉండకుండా ఉండదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు