మహేష్‌ - రాజమౌళి... జరిగే పనేనా?

మహేష్‌ - రాజమౌళి... జరిగే పనేనా?

మహేష్‌తో రాజమౌళి చిత్రం చాన్నాళ్లుగా పెండింగ్‌లో వుంది. దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందాల్సి వుంది. ఇద్దరికీ కె.ఎల్‌. నారాయణ అడ్వాన్సులు ఇచ్చి చాలా ఏళ్లవుతోంది. బాహుబలికి ముందే తీస్తాడని అనుకున్న ఆ సినిమా వాయిదా పడింది. ఆర్‌.ఆర్‌.ఆర్‌. తర్వాత అయినా ఈ కాంబినేషన్‌లో సినిమా వుంటుందా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌లో మహేష్‌తో సినిమా వుందని రాజమౌళి ఇప్పటికీ చెబుతుంటాడు. అయితే అది ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది తెలియదు. ప్రస్తుతం రాజమౌళి చిత్రాలకి అతను ఏది చెబితే అదే జరుగుతోంది. రాజమౌళి చెప్పిందే వేదమన్నట్టు నిర్మాతలయినా, హీరోలయినా నడుచుకోవాలి.

మరోవైపు మహేష్‌ తీరు కూడా ఇలాగే వుంది. తన సినిమాలకి సర్వం తానే అవ్వాలని మహేష్‌ చూస్తున్నాడు. సినిమా బడ్జెట్‌ నుంచి రిలీజ్‌ డేట్‌ వరకు అన్నీ మహేష్‌ డెసిషన్‌పై డిపెండ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిస్తే ఒకరిని ఒకరు డామినేట్‌ చేసుకోకుండా కలిసి పని చేస్తారా అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్నట్టు రాజమౌళి తదుపరి చిత్రం 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' ఇతర మార్కెట్లలో ఎలా పర్‌ఫార్మ్‌ చేస్తుందనే దానిపై ఆధారపడి వుంది. తదుపరి చిత్రం తెలుగు హీరోలతో తీయాలా లేక పూర్తిస్థాయిలో బాలీవుడ్‌లో ప్లాన్‌ చేయాలా అని రాజమౌళి డిసైడ్‌ అవలేదింకా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English