రజనీ లేకుండా శంకర్‌ ఆటలు చెల్లవు

రజనీ లేకుండా శంకర్‌ ఆటలు చెల్లవు

శంకర్‌ తీసిన '2.0' చిత్రంపై అయిదు వందల కోట్ల పెట్టుబడి పెట్టడానికి నిర్మాత వెనుకాడలేదంటే అందులో రజనీకాంత్‌ ఫ్యాక్టర్‌ పెద్ద పాత్ర పోషించింది. రజనీకాంత్‌ లేకుండా కోట్లు కుమ్మరించమని అడిగితే మాత్రం శంకర్‌ ఆటలు చెల్లడం లేదు. 2.0 కాస్ట్‌ ఫెయిల్యూర్‌ అయినప్పటికీ శంకర్‌, రజనీ కాంబినేషన్‌పై మళ్లీ మూడు, నాలుగు వందల కోట్లు వెచ్చించడానికి నిర్మాతలు వెనుకాడరంటే అతిశయోక్తి కాదు. అలాగని రజనీ లేకుండా భారీ బడ్జెట్‌ కావాలంటే శంకర్‌ మాట నెగ్గదు.

ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రానికి అదే ఇబ్బందిగా మారింది. కమల్‌హాసన్‌కి ప్రస్తుతం తమిళనాడులో కూడా మార్కెట్‌ లేదు. అతని సినిమాలకి నామమాత్రపు వసూళ్లు కూడా రావడం లేదు. కానీ ఇండియన్‌కి సీక్వెల్‌ అనేసరికి, శంకర్‌ దర్శకుడనేసరికి క్రేజ్‌ ఏర్పడింది. ఇంతవరకు బాగానే వుంది. కానీ ఈ చిత్రానికి కూడా శంకర్‌ మోతాదుకి మించి పెట్టుబడి పెట్టమనడంతో చిక్కొచ్చి పడింది.

కమల్‌పై అంత ఖర్చు పెడితే సినిమా చాలా బాగుందనే టాక్‌ వచ్చినా డబ్బులు తిరిగి రావని నిర్మాతలు తేల్చేయడంతో ఇప్పుడు బడ్జెట్‌ లెక్కల దగ్గర ఈ చిత్రం చిక్కుబడిపోయింది. దీంతో ఈ చిత్రాన్ని ముందుకి తీసుకెళ్లడానికి తంటాలు పడుతోన్న శంకర్‌ మరోసారి రజనీకాంత్‌తో సినిమా చేయడానికి ఉపక్రమిస్తున్నాడనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి రజనీకాంత్‌ లేకుండా శంకర్‌ పప్పులు ఉడకడం లేదంటోంది తమిళ సినీ ఇండస్ట్రీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English