రాజమౌళి, ఆర్‌.ఆర్‌.ఆర్‌. సేఫ్‌!

రాజమౌళి, ఆర్‌.ఆర్‌.ఆర్‌. సేఫ్‌!

ఆర్‌.ఆర్‌.ఆర్‌. చిత్రాన్ని వచ్చే ఏడాది జులై 30న విడుదల చేస్తున్నట్టు రాజమౌళి ప్రకటించాడు. అయిదు వందల రోజుల ముందే రిలీజ్‌ డేట్‌ ప్రకటించడం విశేషమే అయినా ఆ టైమ్‌లో వేరే చిత్రాల నుంచి పోటీ రాకుండా వుండేందుకే ఇంత ఎర్లీగా డేట్‌ అనౌన్స్‌ చేసి వుంటారనేది విశ్లేషకుల మాట. తెలుగులో ఆర్‌.ఆర్‌.ఆర్‌.కి ఎదురు వెళ్లడానికి ఎవరూ సాహసించకపోవచ్చు కానీ హిందీలో మాత్రం పలు చిత్రాలు దీనికి ఎదురు పడతాయని తెలుగు మీడియానే ఎక్కువ హల్‌చల్‌ చేస్తోంది. 2020 ఈద్‌కి సల్మాన్‌ఖాన్‌ సినిమా 'ఇన్షాల్లా' విడుదలవుతుందని తెలియగానే 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'కి బ్యాడ్‌ న్యూస్‌ అంటూ ఊదరగొట్టేస్తున్నారు. కానీ సల్మాన్‌ సినిమా రిలీజ్‌ అయ్యేది రంజాన్‌కి... అంటే మే 22న.

రాజమౌళి సినిమా వచ్చేది బక్రీద్‌కి. రెండు సినిమాల మధ్య అయిదు వారాల వ్యవధి వుంటుంది. హిందీ మార్కెట్‌ కీలకమని భావించి దానికి అనుగుణంగా ప్లాన్‌ చేసుకుంటోన్న రాజమౌళి చూస్తూ చూస్తూ రంజాన్‌కి తన సినిమా ఎలా విడుదల చేస్తాడు? రంజాన్‌ బాలీవుడ్‌ సినిమాలకి ఎంత పెద్ద సీజన్‌ అనేది రాజమౌళికి తెలియదా ఏంటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English