విజయ్ చేయాలే కానీ.. రచ్చ రచ్చే

విజయ్ చేయాలే కానీ.. రచ్చ రచ్చే

తెలుగు ‘బిగ్ బాస్' హోస్ట్ కథ రోజుకో మలుపు తిరుగుతోంది. తొలి సీజన్లో ఎన్టీఆర్ అదరగొట్టాక అతడి స్థానంలోకి వచ్చిన నాని రెండో సీజన్‌లో బాగానే మేనేజ్ చేశాడు కానీ.. ఆ షో తాలూకు నెగెటివిటీని తట్టుకోలేక మళ్లీ ‘బిగ్ బాస్' జోలికి వచ్చేది లేదని చెప్పేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ స్థానంలోకి ఎవరిని తేవాలో తెలియక తికమకపడిపోతోంది మా టీవీ యాజమాన్యం తిరిగి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లారు కానీ.. అతను కుదరదనేశాడు.

మధ్యలో విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జునల పేర్లు వినిపించాయి. కానీ వీళ్లెవ్వరూ షో చేస్తామని హామీ ఇచ్చినట్లు లేదు. చివరికిప్పుడు ‘బిగ్ బాస్-3' హోస్ట్‌గా విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తోంది. గతంలో కూడా ఒకసారి విజయ్ పేరు తెరమీదికి వచ్చింది. కానీ ఆ తర్వాత ఆ సంగతి పక్కకు వెళ్లిపోయి వేరే పేర్లు వినిపించాయి. ఇప్పుడు మాత్రం విజయ్ పక్కా అని అంటున్నారు.

నిజంగా విజయ్ దేవరకొండనే ‘బిగ్ బాస్-3' హోస్ట్ చేస్తే మాత్రం రచ్చ మామూలుగా ఉండదు. అతడి యాటిట్యూడ్ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. వేదికలెక్కినపుడు విజయ్ ఎంత ఆసక్తికరంగా మాట్లాడతాడో.. సడెన్ సర్ప్రైజ్‌లతో జనాల్ని ఎలా ఆశ్చర్యపరుస్తాడో తెలిసిందే. ఏదీ ప్లాన్ చేసి మాట్లాడినట్లుగా ఉండదు. క్యాజువల్‌‌గా మాట్లాడుతూనే ప్రసంగాల్ని రక్తి కట్టిస్తాడు.

అతను జనాలతో కనెక్ట్ అయ్యే.. సంభాషించే తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కొన్నిసార్లు సంచలన వ్యాఖ్యలతో కాంట్రవర్శీస్ సైతం క్రియేట్ చేస్తుంటాడు. ఏం చేసినా కూడా ప్రతిదీ ఆసక్తి రేకెత్తిస్తుంటుంది. ‘బిగ్ బాస్'కు విజయ్ దేవరకొండ లాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్లు బాగానే సెట్టవుతారు. విజయ్ హోస్ట్ చేస్తే మాత్రం వీకెండ్లలో షోకు జనాలు అతుక్కుపోతారనడంలో సందేహం లేదు. యూత్‌ను మరింతగా ఈ షో పట్ల అట్రాక్ట్ చేయొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English