అఖిల్.. వెయిట్ ఎక్కువైపోదూ!

అఖిల్.. వెయిట్ ఎక్కువైపోదూ!

అక్కినేని అఖిల్‌తో కియారా అద్వానీ.. నిన్నట్నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్త ఇది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ చేయబోయే సినిమాలో ఆమే కథానాయిక అంటున్నారు. తొలి రెండు సినిమాల్లో అఖిల్ సరసన కొత్త హీరోయిన్లు నటించారు. మూడో సినిమాలో అతడితో జోడీ కట్టిన నిధి అగర్వాల్ సైతం పెద్దగా అనుభవం, ఇమేజ్ లేని అమ్మాయే. సాధారణంగా కొత్త హీరోల పక్కన పేరున్న హీరోయిన్లను పెట్టడానికి ఆసక్తి చూపించరు. హీరోయిన్లు డామినేట్ చేస్తే.. హీరోకు ఇబ్బందన్నదే దీని వెనుక ఉద్దేశం. హీరో కొంచెం నిలదొక్కుకుున్నాక, తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నాక స్టార్ హీరోయిన్లతో జోడీ కట్టిస్తుంటారు. ఐతే అఖిల్ కెరీర్ ఇప్పటిదాకా ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది.

ఒకరకంగా చెప్పాలంటే తొలి సినిమా విడుదలకు ముందే అతడికి ఎక్కువ క్రేజ్ ఉంది. మార్కెట్టూ ఉంది. అనూహ్యంగా సినిమా సినిమాకూ అతడి స్థాయి పడిపోయింది. మార్కెట్ దెబ్బ తింది. మూడుకు మూడు సినిమాలూ డిజాస్టర్లే కావడంతో ఇప్పుడు అఖిల్ కెరీర్ ప్రమాదంలో ఉంది. కెరీర్లో అంత ఎదుగుదలేమీ లేనపుడు.. అఖిల్‌కు జోడీగా ఇప్పుడు కూడా స్టార్ హీరోయిన్ని పెడితే కష్టమే. అందులోనూ మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి సూపర్ స్టార్ల పక్కన నటించిన కియారాను అఖిల్‌తో జోడీ కట్టిస్తే ఇమేజ్ బ్యాలెన్స్ కాదు. హీరోయిన్ వెయిట్ ఎక్కువ అయిపోతుంది. అయినా తెలుగులో అంతేసి పెద్ద హీరోలతో నటించి, బాలీవుడ్లోనూ స్టార్ స్టేటస్ సంపాదించిన కియారా.. హిట్టు ముఖం చూడని, కెరీర్లో తిరోగమనం వైపు నడుస్తున్న అఖిల్ లాంటి హీరో పక్కన నటించడానికి అంగీకరిస్తుందా అన్నది సందేహం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English