ఆ రీమేక్‌లో బాలయ్య-రాజశేఖర్?

ఆ రీమేక్‌లో బాలయ్య-రాజశేఖర్?

సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, రాజశేఖర్ కలిసి ఓ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? ఈ ఊహే చాలా విచిత్రంగా అనిపిస్తోంది కదా? ఐతే వీళ్లిద్దరూ కలిసి ఓ తమిళ రీమేక్‌లో నటించబోతున్నారన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియదు కానీ.. ఈ రూమర్ అయితే అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ వీళ్లు నటిస్తారంటున్న ఆ రీమేక్ ఏదో తెలుసా.. విక్రమ్ వేద. భార్యాభర్తలైన దర్శకులు పుష్కర్-గాయత్రి కలిసి తీసిన మల్టీస్టారర్ మూవీ ఇది. 2017లో విడుదలైన ఈ చిత్రంలో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో గత కొన్నేళ్లలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఇది ఒకటిగా చెప్పొచ్చు.

ఐఎండీబీ హైయెస్ట్ రేటింగ్ ఇచ్చిన ఇండియన్ మూవీ ఇదే కావడం విశేషం. దీన్ని పలు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీలో షారుఖ్ ఖాన్‌తో పాటు మరో స్టార్ ఈ రీమేక్‌లో నటిస్తారంటున్నారు. తెలుగులో ఈ రీమేక్‌కు ఒక హీరోగా ముందు నాగార్జున పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా బాలయ్య-రాజశేఖర్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. దీని రీమేక్ హక్కులు ఎవరి దగ్గరున్నాయి.. రీమేక్‌కు దర్శకుడెవరు అన్నది తెలియరాలేదు. కానీ రీమేక్ మాత్రం పక్కా అంటున్నారు. రెండేళ్ల ముందు వరకు రాజశేఖర్ అనేవాడు ఇండస్ట్రీలో ఉన్నట్లు కూడా తెలియదు. ఐతే ‘గరుడవేగ’తో మళ్లీ ఉనికిని చాటుకుని.. ప్రస్తుతం ‘కల్కి’ అనే ఇంట్రెస్టింగ్ మూవీలో నటిస్తున్నాడు. మరి బాలయ్యతో కలిసి అతను నిజంగా నటిస్తాడేమో చూడాలి. ఈ వార్త నిజమైతే పోలీస్ పాత్రలకు రాజశేఖర్ పెట్టింది పేరు కాబట్టి అతనే మాధవన్ పాత్రలో కనిపించవచ్చు. బాలయ్య విజయ్ సేతుపతి చేసిన రౌడీ పాత్ర చేయొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English