తల్లిదండ్రులతో సమంతకేంటి ప్రాబ్లెం?

తల్లిదండ్రులతో సమంతకేంటి ప్రాబ్లెం?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోయి చాలా ఏళ్లయింది. ఇక్కడ ఆమె ఒంటరిగానే ఉంటోంది. హైదరాబాద్‌లో ఎప్పుడూ కూడా సమంత తల్లిదండ్రులతో కనిపించింది లేదు. అప్పట్లో ఓ వివాదం నెలకొన్న సందర్భంగా చెన్నైలోని సమంత ఇంటికి మీడియా వాళ్లు వెళ్తే సామ్ తల్లిదండ్రులు చాలా తీవ్రంగా స్పందించారు. మీడియా వాళ్లను దగ్గరికి రానివ్వలేదు.

ఇక సమంత పెళ్లి సమయంలో కూడా ఆమె తల్లిదండ్రులు ఆ వేడుకలో పెద్దగా కనిపించింది లేదు. పెళ్లి తర్వాత అయితే పూర్తిగా సమంతకు తన తల్లిదండ్రులతో కట్ అయిపోయినట్లే కనిపించింది వ్యవహారం. ఎప్పుడూ భర్త చైతన్యతో, అక్కినేని కుటుంబ సభ్యులతోనే కనిపిస్తోంది సామ్. దీన్ని బట్టి తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో సమంతకు ఏదో తేడా జరిగిందనే అనుమానాలు జనాల్లో ఉన్నాయి.

తాజాగా ‘మజిలీ’ ప్రమోషన్లలో భాగంగా సమంత వ్యాఖ్యలు చూస్తే ఈ సందేహాలు మరింత పెరుగుతున్నాయి. మీరెప్పుడు తల్లి కాబోతున్నారు.. బిడ్డ పుట్టాక సినిమాల్లో నటిస్తారా అని అడిగితే.. తానుు కనుక తల్లిని అయితే.. బిడ్డే సర్వస్వమని చెప్పింది సామ్. దీంతో పాటుగా తన బిడ్డకు గొప్ప బాల్యం అందించాలని అనుకుంటున్నట్లు చెప్పింది సామ్. తన బాల్యం సజావుగా సాగలేదని.. కాబట్టి తాను కోల్పోయింది తన బిడ్డకు ఇవ్వాలనుకుంటున్నానని ఆమె అంది. మరి సమంత బాల్యంలో ఏం చేదు అనుభవాలున్నాయో ఏమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

మరోవైపు తాను ఇంటర్మీడియట్ నుంచే తన కాళ్లపై తాను నిలబడే ప్రయత్నం చేశానని, పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ చదువుకున్నానని కూడా సమంత వెల్లడించింది. ఇదంతా చూస్తుంటే సమంతకు తల్లిదండ్రులతో అంత మంచి సంబంధాలు లేవని.. కాబట్టే ఆమెతో వాళ్లెప్పుడూ కనిపించరని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English