లవ్ స్టోరీలకు ఫిక్సయిపో చైతూ..

లవ్ స్టోరీలకు ఫిక్సయిపో చైతూ..

మాస్ ఇమేజ్ తెచ్చుకుంటే.. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటే.. ఎలాంటి సినిమా తీసినా.. మినిమం ఓపెనింగ్స్ ఉంటాయన్నది వాస్తవమే. కానీ మాస్ సినిమాలు సెట్ కాకున్నా.. ఆ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తే మాత్రం కష్టమే. అక్కినేని కుర్రాడు నాగచైతన్యకు ఈ విషయం అర్థం కాక చాలా ప్రయత్నాలు చేసి దెబ్బ తిన్నాడు.

అతడి తొలి సినిమా ‘జోష్’ మాస్ టచ్ ఉన్న సినిమానే. కానీ అది వర్కవుట్ కాలేదు. కానీ తర్వాత ‘ఏ మాయ చేసావె’ లాంటి క్లాసిక్ లవ్ స్టోరీ’లో నటించి మెప్పించాడు. ఇక అప్పట్నుంచి అతడి లవ్ స్టోరీలు భలేగా కలిసొస్తున్నాయి. చైతూ చేసిన ప్రేమకథల్లో దాదాపుగా అన్నీ విజయవంతం అయ్యాయి. అతను మాస్ సినిమా కోసం ప్రయత్నించిన ప్రతిసారీ దారుణమైన అనుభవాలు ఎదురయ్యాయి. దడ.. ఆటోనగర్ సూర్య.. దోచేయ్.. యుద్ధం శరణం.. సవ్యసాచి.. ఇలా చైతూ చేసిన మాస్-యాక్షన్ సినిమాలన్నీ చేదు అనుభవాన్నే మిగిల్చాయి.

కానీ చైతూ ఎన్ని డిజాస్టర్లు ఇచ్చినా.. మళ్లీ ఓ ప్రేమకథ చేశాడంటే మంచి బజ్ వస్తోంది. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఇప్పుడు అతడి నుంచి వస్తున్న ‘మజిలీ’ విషయంలోనూ అంతే. దీనికి ముందు చైతూ మూడు ఫ్లాపులిచ్చాడు. ‘యుద్ధం శరణం’.. ‘శైలజా రెడ్డి అల్లుడు’.. ‘సవ్యసాచి’.. ఈ మూడూ కూడా నిరాశ పరిచాయి. ఇలా హ్యాట్రిక్ ఫ్లాపులు ఇచ్చాక తర్వాతి సినిమాకు బజ్ ఉండకూడదు. బిజినెస్ కష్టం కావాలి. మార్కెట్ పడిపోవాలి. కానీ ‘మజిలీ’ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా మంచి బజ్ తెచ్చుకుంది.

రోజు రోజుకూ ఈ చిత్రానికి హైప్ పెరుగుతోంది. చైతూ కెరీర్లోనే అత్యధిక స్థాయి బిజినెస్ కూడా చేసిందీ సినిమా. ప్రేమకథలు చేసినపుడు ఇంత పాజిటివిటీ ఉంటున్న సంగతి తెలిసి కూడా చైతూ మధ్యలో యాక్షన్ యాక్షన్ అంటున్నాడు. వాటితో ఎదురు దెబ్బలు తింటున్నాడు. ఇకనైనా అతను వాటి జోలికి వెళ్లడం మానేసి తన బలమైన ప్రేమకథలకు ఫిక్సయిపోతే బెటరేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English