నాగార్జునని కొనేసారా?

నాగార్జునని కొనేసారా?

'బిగ్‌బాస్‌' షోకి 'దేవదాస్‌' ప్రమోషన్స్‌ కోసం వచ్చినపుడు ఈ షో కాన్సెప్టే తనకి నచ్చలేదని నాగార్జున అన్నాడు. అలా కొందరిని ఒక ఇంట్లో పడేసి, చుట్టూ కెమెరాలు పెట్టి మనుషుల మనస్తత్వాలని జడ్జి చేయడం రాంగ్‌ అని అభిప్రాయ పడ్డాడు. తనకి ఈ షోపై సదభిప్రాయం లేదని, తానసలు బిగ్‌బాస్‌ చూడనని కూడా చెప్పాడు. కానీ తెలుగు బిగ్‌బాస్‌ మూడవ సీజన్‌కి నాగార్జున హోస్ట్‌ అని గట్టిగా వినిపిస్తోంది. ఇంకా దీనిని స్టార్‌మా కానీ, నాగ్‌ కానీ అధికారికంగా ప్రకటించలేదు కానీ నాగార్జున హోస్ట్‌ చేస్తున్నాడనే సంకేతాలయితే బలంగా అందుతున్నాయి. అసలు షో మీద సరయిన అభిప్రాయం లేకుండా దీనిని హోస్ట్‌ చేయడానికి నాగార్జున ఎలా ఒప్పుకున్నట్టు? ఎన్టీఆర్‌తోనే హోస్ట్‌ చేయించాలని చాలా ట్రై చేసి, అది కుదరకపోవడంతో వేరే ఆప్షన్స్‌లో భాగంగా నాగార్జునని అప్రోచ్‌ అయినట్టున్నారు.

నాగార్జున కాదనలేని పారితోషికం ఆఫర్‌ చేసి ఈ డీల్‌ ఓకే చేసుకున్నారని వినిపిస్తోంది. అదే నిజమయితే షో పట్ల తనకి మంచి ఒపీనియన్‌ లేకపోయినా నాగార్జున కేవలం మనీ కోసం బిగ్‌ బాస్‌గా మారుతున్నాడా? మీలో ఎవరు కోటీశ్వరుడుని సూపర్‌ సక్సెస్‌ చేసిన నాగ్‌ బిగ్‌బాస్‌గా కూడా అలరిస్తాడనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కాకపోతే ఈ షో గురించి గతంలో నాగ్‌ వ్యక్తపరిచిన అభిప్రాయాల వల్ల ఆయన ఇది హోస్ట్‌ చేయడానికి అంగీకరించాడనే వార్త ఆకర్షిస్తోందంతే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English