మెగా హీరోకి శకునాలు బాగున్నాయ్‌

మెగా హీరోకి శకునాలు బాగున్నాయ్‌

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌కి శకునాలు అన్నీ అనుకూలిస్తున్నాయి. 'చిత్రలహరి' టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. కేవలం హీరోని, అతని లవ్‌ స్టోరీని అన్నట్టు చూపించకుండా అయిదు పాత్రలని పరిచయం చేస్తూ హీరోని కూడా కథలో భాగంగా చూపించిన విధానం మెప్పించింది. అందుకే చిత్రలహరి టీజర్‌కి లక్షల కొద్దీ వ్యూస్‌ వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని మొదటి పాట 'పరుగు పరుగు' విడుదలైంది. ఈమధ్య కాలంలో సరయిన ఫామ్‌లో లేని దేవిశ్రీప్రసాద్‌ వినగానే ఆకట్టుకునే పాటని అందించడం స్పెషాలిటీ.

ఈ పాట మొదలైనపుడు మామూలుగానే అనిపించినా రెండవ చరణం ముగిసిన తర్వాత మళ్లీ పల్లవి వచ్చే టైమ్‌కి కనక్ట్‌ అయిపోయి మళ్లీ వినాలనిపిస్తుంది. ఈల బ్యాక్‌గ్రౌండ్‌కి తోడు శాక్సోఫోన్‌తో ఇచ్చిన టచ్‌ ఈ పాటని మరో మెట్టు ఎక్కించింది. యూత్‌ ఇన్‌స్టంట్‌గా కనక్ట్‌ అయ్యే లిరిక్స్‌తో దేవిశ్రీప్రసాద్‌ ఈ పాటలో అటు సంగీత దర్శకుడిగా, ఇటు గేయ రచయితగా కూడా షైన్‌ అయ్యాడు. టీజర్‌ తర్వాత మొదటి పాట కూడా మంచి స్పందన రాబట్టుకోవడంతో చిత్రలహరికి శకునాలన్నీ బాగున్నాయ్‌. అన్నీ కలిసి వస్తే సాయి ధరమ్‌ తేజ్‌ని కష్టాలనుంచి గట్టెక్కించే సినిమా ఇదే అవ్వాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English