వంద కోట్లపై కన్నేసిన విజయ్‌ దేవరకొండ

వంద కోట్లపై కన్నేసిన విజయ్‌ దేవరకొండ

గీత గోవిందం డెబ్బయ్‌ కోట్ల షేర్‌ సాధించిన మాట వాస్తవమే కానీ విజయ్‌ దేవరకొండ మార్కెట్‌ అంత అని చెప్పలేం. మరో రెండు సార్లయినా అంత వసూళ్లని అతను సాధించగలిగితే అది స్టాండర్డ్‌ మార్కెట్‌ అనిపించుకుంటుంది. అయితే తన సినిమాకి అంత పొటెన్షియల్‌ వుందని మాత్రం రుజువయింది. తెలుగు సినిమా పెద్ద స్టార్ల మార్కెట్‌ ఇప్పుడు వంద కోట్ల మార్కుకి అటు ఇటుగా వుంది.

విజయ్‌ దేవరకొండ అంత ఎత్తుకి ఎదగాలంటే ఇంకాస్త టైమ్‌ పడుతుంది. నిలకడగా విజయాలు సాధిస్తూ ఆ స్థాయిని అందుకోవాల్సి వుంటుంది. అయితే ఈలోగా తన మార్కెట్‌ని ఎక్స్‌పాండ్‌ చేసుకునేందుకు విజయ్‌ కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాడు. పాన్‌ సౌత్‌ ఇండియా స్టార్‌ కావాలని చూస్తున్నాడు. ఆల్రెడీ నోటాతో తమిళంలో అడుగు పెట్టిన విజయ్‌ దేవరకొండ ఇకపై తన సినిమాలన్నీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో కూడా విడుదలయ్యేట్టు చూస్తున్నాడు.

ఇప్పటికిప్పుడు తనకి పక్క రాష్ట్రాల్లో మార్కెట్‌ రాదని అతనికి తెలుసు. కానీ ఇప్పట్నుంచే దాని మీద శ్రద్ధ పెట్టి నెమ్మదిగా అన్ని రాష్ట్రాల్లోను గ్యారెంటీ మార్కెట్‌ చూసుకుంటున్నాడు. తద్వారా తన సినిమాలు పెద్ద హిట్‌ అయితే వంద కోట్ల షేర్‌ సాధించే విధంగా అతను ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. ఇందుకోసం ఇతర రాష్ట్రాలకి చెందిన దర్శకులతో చర్చలు సాగిస్తున్నాడు. అలాగే అన్ని భాషలకీ అప్పీల్‌ అయ్యే కథలు మాత్రమే ఎంచుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English