కింగ్‌కి మళ్లీ అవమానం!

కింగ్‌కి మళ్లీ అవమానం!

వరుస వైఫల్యాలతో తన సూపర్‌స్టార్‌డమ్‌ మొత్తం కోల్పోయి బేలగా కనిపిస్తోన్న షారుక్‌ ఖాన్‌కి త్వరలోనే ఒక అద్భుతమైన చిత్రం సెట్‌ అవనుందంటూ ప్రచారం జోరుగా జరిగింది. భారీ బ్లాక్‌బస్టర్లు రూపొందిస్తోన్న సంజయ్‌ లీలా భన్సాలీ షారుక్‌, సల్మాన్‌తో ఒక మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేస్తున్నాడని మీడియాలో బలంగా వినిపించింది. కానీ సంజయ్‌ లీలా భన్సాలీ ఇద్దరిలో ఒక్కరు చాలనుకున్నాడు.

ప్రస్తుతం మార్కెట్‌ లేని షారుక్‌ కంటే సల్మాన్‌ ఖాన్‌తో చేయడం ఉత్తమమని భావించాడు. అందుకే సల్మాన్‌తో తదుపరి చిత్రాన్ని అనౌన్స్‌ చేసేసాడు. సల్మాన్‌, ఆలియా భట్‌తో ఇన్షాల్లా అనే చిత్రాన్ని సంజయ్‌ లీలా భన్సాలీ ప్రకటించాడు. ఇది షారుక్‌ అభిమానులకి అశనిపాతంలా తగిలింది. మళ్లీ షారుక్‌ ఫామ్‌లోకి రావడానికి భన్సాలీ చిత్రం అక్కరకు వస్తుందని భావించిన అభిమానులు అతను కూడా హ్యాండ్‌ ఇవ్వడంతో కుదేలైపోయారు.

భన్సాలీతో సినిమా వుందని ప్రచారం చేయించుకున్నా అతను తనని కన్సిడర్‌ చేయకపోవడంతో కింగ్‌ ఖాన్‌ మరోసారి అవమానపడ్డాడు. జీరో డిజాస్టర్‌ అయిన తర్వాత ఇంతవరకు షారుక్‌ కొత్త సినిమా ఏదీ అంగీకరించలేదు. అంతకుముందు ఒప్పుకున్న సినిమాలు కూడా కాన్సిల్‌ చేసుకున్నాడు. తానే నిర్మించిన బద్లా చిత్రం విజయం సాధించినా కానీ షారుక్‌కి అంతగా ఆనందం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English