రాజమౌళికి ఈ డోస్‌ చాలదంట

రాజమౌళికి ఈ డోస్‌ చాలదంట

బాహుబలి తర్వాత చిత్రం తెలుగు హీరోలతో చేస్తూ పాన్‌ ఇండియా అప్పీల్‌ కోసం రాజమౌళి పడుతోన్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎన్టీఆర్‌, చరణ్‌ కలిసి నటించడం వల్ల తెలుగు మార్కెట్‌కి ఢోకా లేదు. రాజమౌళి బ్రాండ్‌ కూడా కలిసింది కనుక లెక్క రెండు వందల కోట్ల నుంచి మొదలవ్వవచ్చు. కానీ తెలుగేతర మార్కెట్లలో రాజమౌళి తప్ప హీరోల వల్ల వచ్చేది ఏమీ వుండదు. అందుకే ఈ చిత్రానికి చారిత్రిక నేపథ్యాన్ని, పీరియడ్‌ సెటప్‌ని రాజమౌళి సెట్‌ చేసాడు. అయితే నార్త్‌లో ఈమాత్రం డోస్‌తో తన సినిమా ఆడేస్తుందనే నమ్మకం రాజమౌళికి కూడా వున్నట్టు లేదు. అందుకే 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'లో హిందీ నటులకి ప్రాధాన్యం ఇస్తున్నాడు.

అజయ్‌ దేవ్‌గన్‌తో కీలక పాత్ర చేయిస్తోన్న రాజమౌళి ఒక హీరోయిన్‌గా ఆలియా భట్‌కి భారీ పారితోషికం ఇచ్చి పెట్టుకున్నాడు. వీరిద్దరూ వున్నంత మాత్రాన ఆర్‌.ఆర్‌.ఆర్‌కి పాన్‌ ఇండియా అప్పీల్‌ రాదని రాజమౌళికి తెలుసు. అందుకే మరో రెండు పాత్రలకి ప్రముఖ బాలీవుడ్‌ హీరోలని సంప్రదిస్తున్నాడు. సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌, యంగ్‌ హీరో వరుణ్‌ ధవన్‌తో ఈ చిత్రంలో కీలక పాత్రలు చేయించాలని రాజమౌళి చూస్తున్నాడు. ఇందుకోసం బాలీవుడ్‌లో తన కనక్షన్స్‌ వాడుతున్నాడని, కరణ్‌ జోహార్‌ చెప్పడం వల్లే ఇందులో ఆలియా కూడా నటిస్తోందని చెబుతున్నారు. ఒక్క బాలీవుడ్‌ నటుడు కూడా లేకుండా బాహుబలిని ఇండియాలోనే అతి పెద్ద హిట్‌గా నిలబెట్టిన రాజమౌళికి ఆర్‌.ఆర్‌.ఆర్‌ విషయంలో మాత్రం ఎందుకో ఆ తెగువ కనిపించడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English