ఎన్టీఆర్, చరణ్‌లకు ఇన్‌స్పిరేషన్ అతడే..

ఎన్టీఆర్, చరణ్‌లకు ఇన్‌స్పిరేషన్ అతడే..

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు ఇటీవలే వెల్లడైన సంగతి తెలిసిందే. మొన్నటి ప్రెస్ మీట్లో ఎన్టీఆర్, చరణ్‌ల పాత్రల గురించి వెల్లడించిన జక్కన్న అజయ్ దేవగణ్ క్యారెక్టర్ గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. కథలో ఆయన పాత్ర కీలకమని.. ఫ్లాష్ బ్యాక్‌లో వస్తుందని మాత్రం వెల్లడించాడు జక్కన్న.

చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ అరగంట మాత్రమే కనిపిస్తాడట. ఫ్లాష్ బ్యాక్ 40 నిమిషాలుంటే అందులో పది నిమిషాలు మినహా అజయ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిసింది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు యుక్త వయసులో తమ స్వస్థలాల్ని వీడి ఉత్తర భారతానికి వెళ్లడం.. అక్కడ వారిలో గొప్ప మార్పు చోటు చేసుకుని తిరిగి యోధులుగా తమ ప్రాంతాలకు రావడం.. ఈ నేపథ్యంలో కథ నడుస్తుందని జక్కన్న చెప్పిన సంగతి తెలిసిందే.

ఐతే ఒక లక్ష్యమంటూ లేకుండా ఉత్తర భారతానికి వెళ్లిన వీళ్లిద్దరిలో స్ఫూర్తి నింపి.. వారికి మార్గ నిర్దేశం చేసే పాత్రలో అజయ్ కనిపిస్తాడని సమాచారం. అతను స్వాతంత్ర్య సమర యోధుడి పాత్రలో నటిస్తాడట. ఆ పాత్రను చూసే హీరోలిద్దరూ ఇన్‌‌స్పైర్ అవుతారట. చాలా పవర్‌ఫుల్‌గా ఆ పాత్రను మలిచారట. తక్కువ సమయమే కనిపించినా అజయ్ ఇంపాక్ట్ మాత్రం బలంగా ఉంటుందని అంటున్నారు.

అజయ్‌తో పాటు కథానాయిక ఆలియాభట్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణలో భాగమవుతారట. రాబోయే షెడ్యూళ్లలో ముందుగా చరణ్, తారక్‌ల మీద కీలక సన్నివేశాలుు తీయనున్నారట. రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాక మిగతా పాత్రల ప్రవేశం ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో బ్రిటిష్ టీవీ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ మరో కథానాయికగా నటించనున్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు సముద్రఖని ఇందులో మరో కీలక పాత్ర చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English