ఎన్టీఆర్‌ను మళ్లీ అడిగి లేదనిపించుకున్నారు

ఎన్టీఆర్‌ను మళ్లీ అడిగి లేదనిపించుకున్నారు

రెండేళ్ల కిందట అనేకానేక సందేహాల మధ్య తెలుగులో మొదలైన ‘బిగ్ బాస్’ షోకు ఆకర్షణ తెచ్చిన ఘనత ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్‌కే దక్కుతుంది. తనదైన వాక్చాతుర్యంతో ఆ షోను రక్తి కట్టించి.. జనాలు దానికి కనెక్టయ్యేలా చేయగలిగాడు ఎన్టీఆర్. ఆ తర్వాత షోలో పాల్గొన్న పార్టిసిపెంట్లు కూడా తలో చేయి వేసి షోను ముందుకు తీసుకెళ్లారు. ఐతే తొలి సీజన్‌ను అద్భుత రీతిలో నడిపించిన తారక్.. రెండో సీజన్‌కు అందుబాటులో లేకపోవడం అందరినీ నిరాశ పరిచింది.

మళ్లీ అతడితో‌నే ‘బిగ్ బాస్’ను హోస్ట్ చేయించాలని చూసిన మా టీవీ సఫలం కాలేకపోయింది. వేరే కమిట్మెంట్లుండటంతో ఎన్టీఆర్ రెండో సీజన్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన నాని బాగానే చేసినప్పటికీ.. ఇక్కడ నెగెటివిటీని తట్టుకోలేకపోయాడు. ఈ షోకో దండం పెట్టేసి సైడ్ అయిపోయాడు. అతడికి మళ్లీ ‘బిగ్ బాస్’ను హోస్ట్ చేసే ఉద్దేశాలే ఉన్నట్లు లేదు. మా టీవీ వాళ్లు కూడా అతడిని ఫోర్స్ చేస్తున్నట్లు లేరు.

మరి మూడో సీజన్‌కు షోను ఎవరితో హోస్ట్ చేయిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముందు విక్టరీ వెంకటేష్ పేరు వినిపించింది. కానీ ఆయన నో అన్నట్లు తెలుస్తోంది. వెంకీ ఎంతైనా రిజర్వ్డ్‌గా ఉంటాడు. గల గలా మాట్లాడలేడు. ఫ్రీ ఫ్లో ఉండదు. బిడియం ఎక్కువ. వేదికల మీద కూడా మాట్లాడటం తక్కువే. కాబట్టి ఆయన ‘బిగ్ బాస్’ను హోస్ట్ చేయడానికి వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. తనకున్న కమిట్మెంట్ల వల్ల కూడా వెంకీ నో అన్నట్లు సమాచారం.

ఐతే మళ్లీ ‘మా’ వాళ్లు తిరిగి ఎన్టీఆర్ దగ్గరికే వెళ్లి ఈ సీజన్‌‌ వరకు షోను నడిపించమని అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఐతే తాను ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టో చెప్పి.. రాజమౌళి నుంచి అనుమతి తెచ్చుకోవడం చాలా కష్టమని, డేట్లు సర్దుబాటు చేయలేనని చెప్పేశాడట. ఈ ఏడాది చివరికల్లా ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి చేయాల్సి ఉందని.. కాబట్టి ‘బిగ్ బాస్’లో భాగం కాలేనని అన్నాడట. వచ్చే ఏడాది కూడా కష్టమని తేల్చేశాడట. దీంతో చివరికి అక్కినేని నాగార్జున వద్దకు వెళ్లారట మా ప్రతినిధులు. ఈసారికి ఆయనే షోను హోస్ట్ చేయొచ్చని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English