దేవరకొండ ముద్దులపై పేలుతున్న జోకులు

దేవరకొండ ముద్దులపై పేలుతున్న జోకులు

తెలుగులో ఒక పేరున్న హీరో లిప్ లాక్ చేయడం అరుదైన విషయమే. చాలా విషయాల్లో తెలుగు హీరోలు అడ్వాన్స్ అయ్యారు కానీ.. లిప్ లాక్స్ విషయంలో మాత్రం మనోళ్లది వెనుకంజే. అయితే యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మాత్రం ట్రెండు మార్చేశాడు. వరుసగా ముద్దుల మోత మోగించి.. మిగతా హీరోలు కూడా తనను అనుసరించేలా చేశాడు.

తెలుగు సినిమాల్లో పెదవి ముద్దుల్ని సాధారణీకరించిన ఘనత అతడికే దక్కుతుంది. ‘అర్జున్ రెడ్డి’లో షాలిని పాండేతో అతను ఎన్ని లిప్ లాక్స్ చేశాడో లెక్కే లేదు. ఐతే ఆ సినిమా స్థాయిలో కాకపోయినా.. వేరే చిత్రాల్లో కూడా అతను లిప్ లాక్స్ లాగిస్తూనే వస్తున్నాడు. ‘ద్వారక’లో పూజా జవేరితో.. ‘గీత గోవిందం’లో రష్మిక మందన్నాతో.. ‘నోటా’లో ఓ ఫారిన్ బ్యూటీతో విజయ్ పెదవి ముద్దులు లాగించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘డియర్ కామ్రేడ్’లో మరోసారి రష్మిక మందన్నాతో లిప్ లాక్ చేశాడు. ఇది చాలా ఇంటెన్స్‌గా ఉండి టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండను టాలీవుడ్ ఇమ్రాన్ హష్మికి అభివర్ణిస్తున్నారు నెటిజన్లు. హష్మి.. దేవరకొండను తన తమ్ముడిగా చూపిస్తున్నట్లు ఒక మీమ్ తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. హష్మి లాగే విజయ్ లిప్ లాక్స్ విషయంలో చూపించే ఈజ్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మిగతా తెలుగు స్టార్లలో చాలా మంది ఒక్కసారి కూడా లిప్ లాక్ సీన్ చేయలేదు కానీ.. విజయ్ మాత్రం ప్రతి సినిమాలో పెదవి ముద్దులు లాగించేస్తుండటం విశేషమే. ‘అర్జున్ రెడ్డి’లో అతను అన్నేసి ముద్దులు పెట్టేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఐతే సాధారణంగా హత్య అనేది చాలా పెద్ద విషయమని.. నిజ జీవితంలో అందరూ హత్యలు చేయరని.. ఐతే సినిమాలో మాత్రం ఒక మనిషిని చంపడాన్ని వయొలెంట్‌గా చూపిస్తున్నపుడు.. ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైన ముద్దును తెరపై ఒక సాధారణమైన విషయంలాగా చూపించడంలో తప్పేముందంటూ గతంలో ఒకసారి విజయ్ లాజిక్ తీశాడు. ఆ సూత్రాన్ని అనుసరించే తన ప్రతి సినిమాలో ముద్దు సీన్ కామన్‌గా పెట్టుకుంటున్నాడేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English