'నా ఫేసు, ఫిజిక్‌కి అవి అవసరమా!

'నా ఫేసు, ఫిజిక్‌కి అవి అవసరమా!

యాక్షన్‌ సినిమాలకి తన ఫేసు, ఫిజిక్కు సూట్‌ కాదని సిద్ధార్థ్‌ అంటున్నాడు. తనలాంటి సాఫ్ట్‌ లుక్‌ ఉన్న హీరోలు పెద్ద పెద్ద రౌడీలని ఎత్తి అవతలేస్తుంటే చూడ్డానికి అసహ్యంగా ఉంటుందని, నమ్మశక్యంగా ఉండకపోగా, నవ్వుల పాలయ్యే ప్రమాదం ఉందని, అందుకే తాను యాక్షన్‌ సినిమాలకి దూరంగా ఉంటున్నానని సిద్ధార్థ్‌ చెప్పాడు. అయితే కథానుసారం అక్కడక్కడా కాస్త యాక్షన్‌ ఉంటే మాత్రం నటించడానికి అభ్యంతరం లేదని, అలాగే ఆట, అనగనగా ఓ ధీరుడు చిత్రాల్లో నటించానని సిద్ధూ పేర్కొన్నాడు. గమనిస్తే అతను చెప్పిన రెండు చిత్రాలు ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యాయి.

అలా అని సిద్ధార్థ్‌ లవర్‌బాయ్‌ వేషాలు వేస్తే తప్పక హిట్‌ కొడతాడనే గ్యారెంటీ లేదు. బొమ్మరిల్లు తర్వాత లవ్‌ ఫెయిల్యూర్‌ వరకు మరో చెప్పుకోతగ్గ హిట్‌ లేని సిద్ధార్థ్‌ లవర్‌బాయ్‌గా చాలా సినిమాల్లో కనిపించాడు. ఇలాంటి సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయంటే వాటిలో లోపాలున్నాయి కానీ తను జనానికి నచ్చక కాదని వివరణ ఇస్తున్నాడు. రాబోయే రోజుల్లో మాత్రం తనకంతా మంచే జరుగుతుందని, ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్స్‌లో పాల్పంచుకునే అదృష్టం దక్కిందని చెప్పుకుని ఆనంద పడుతున్నాడు. ఆల్‌ ది బెస్ట్‌ సిద్ధూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు