తారక్‌ వల్ల హాట్‌గా మారిన టీవీ పిల్ల!

తారక్‌ వల్ల హాట్‌గా మారిన టీవీ పిల్ల!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, చరణ్‌ హీరోలుగా రూపొందుతోన్న 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' చిత్రంలో తారక్‌ సరసన ఆంగ్ల నటీమణి నటిస్తుండడం అందరి దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది. చరణ్‌ సరసన ఆలియా భట్‌ లాంటి ప్రముఖ బాలీవుడ్‌ నటి నటిస్తోంటే, తారక్‌ సరసన మాత్రం ఆంగ్ల నటిని రాజమౌళిని ఎంచుకున్నాడు. అలా అని హాలీవుడ్‌ సినిమాలు చేసే పాపులర్‌ తారని తీసుకుని రాలేదు. డెయిసీ ఎడ్గార్‌ జోన్స్‌ కేవలం టీవీ సిరీస్‌లలో మాత్రమే నటించింది. కోల్డ్‌ ఫీట్‌, వార్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌ టీవీ సిరీస్‌లతో టీవీ సిరీస్‌లని ఫాలో అయ్యే భారతీయులకి కూడా ఆమె పరిచయముంది.

కాకపోతే అంతకుముందు ఆమె ఎవరనేది ఇక్కడి వారికి అంతగా తెలియదు. తారక్‌ సరసన హీరోయిన్‌ అనే న్యూస్‌ బ్రేక్‌ అయిన తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కి ఫాలోవర్స్‌ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆమె పాత పోస్ట్‌లకి కూడా ఎన్టీఆర్‌ అభిమానులు కామెంట్స్‌ పెడుతూ ఆమెని ఇండియన్‌ సినిమాకి స్వాగతిస్తున్నారు. ఇదంతా ఆమెకి సర్‌ప్రైజింగ్‌గా వున్నా ఇంకా ఆర్‌.ఆర్‌.ఆర్‌పై ఆలియా స్పందించినట్టుగా ఆమె నేరుగా స్పందించలేదు. ఇండియాకి వచ్చేసరికి తనకి పెరిగిన పాపులారిటీ చూసుకుని ఆమె ఖచ్చితంగా షాక్‌ అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English