విజయ్‌ దేవరకొండ మొత్తం మార్చేసాడంట

విజయ్‌ దేవరకొండ మొత్తం మార్చేసాడంట

'గీత గోవిందం' తర్వాత మరో బ్లాక్‌బస్టర్‌ పడితే విజయ్‌ దేవరకొండ సరాసరి సూపర్‌స్టార్ల సరసన చేరిపోయి వుండేవాడు. కానీ ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలు నోటా, టాక్సీవాలా రిలీజ్‌ అవడంతో విజయ్‌ దేవరకొండ రైజ్‌కి కాస్త బ్రేక్‌ పడింది. యువతకి పిచ్చి పిచ్చిగా నచ్చేసిన విజయ్‌ దేవరకొండకి ఇప్పుడు మళ్లీ అర్జున్‌రెడ్డి లాంటి సినిమా పడితే అతని రేంజే వేరు అన్నట్టుంటుంది. అందుకే నోటా ఫ్లాపవగానే డియర్‌ కామ్రేడ్‌ షూటింగ్‌ హోల్డ్‌లో పెట్టి స్టోరీపై మళ్లీ వర్క్‌ చేసారట. అంతకుముందు అనుకున్న కథలోకి చాలా అంశాలని జత చేసారట.

యువతకి ఎలాంటి ఎలిమెంట్స్‌ వుంటే నచ్చుతుందో, ముఖ్యంగా టీజర్‌, ట్రెయిలర్స్‌లో ఏమి చూపిస్తే సినిమా పట్ల క్రేజ్‌ పెరిగి, హైప్‌ వస్తుందో అనేది సమాలోచించుకుని కథలోకి అవి జోడించారట. విజయ్‌ దేవరకొండ డైరెక్షన్స్‌కి అనుగుణంగానే సదరు అంశాలన్నీ కథలోకి చేరాయని, ఇక ఈ చిత్రాన్ని ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో తాను చూసుకుంటానని, ముందుగా అనుకున్న టీజర్‌ని కూడా పక్కన పెట్టి విజయ్‌ స్వయంగా ఈ టీజర్‌ కట్‌ చేయించుకున్నాడట. ఈ టీజర్‌కి వచ్చిన స్పందనతో డియర్‌ కామ్రేడ్‌ టీమ్‌ ఆనందం పట్టలేకపోతోంది. ట్రెయిలర్‌ కూడా వైరల్‌ అయితే కనుక ఇక ఈ చిత్రం రేంజ్‌ సంగతి విజయ్‌ దేవరకొండ చూసుకుంటాడని ప్రత్యేకంగా చెప్పేదేముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English