చిత్రలహరిలో పోసాని సర్‌ప్రైజ్‌ ప్యాకేజ్‌

చిత్రలహరిలో పోసాని సర్‌ప్రైజ్‌ ప్యాకేజ్‌

పోసాని కృష్ణమురళి అనగానే లౌడ్‌ కామెడీకి, లౌడ్‌ యాక్టింగ్‌కి కేరాఫ్‌గా మారిపోయాడు. మామూలుగా ఎవరైనా నటులు అతిగా చేస్తే ఓవరాక్షన్‌ అంటారు. కానీ పోసానిని మాత్రం అదే స్టయిల్లో చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. రచయితగా పాపులర్‌ అయిన దానికంటే ఇప్పుడు నటుడిగానే పోసాని ఎక్కువ బిజీ అయ్యాడు. అసలు తన కాల్షీట్లే దొరకనంత బిజీ అయిపోయాడు. ఒకే తరహా పాత్రలకి, నటనకి అలవాటు పడిన పోసాని కృష్ణమురళి 'చిత్రలహరి'లో మాత్రం దానికి విరుద్ధంగా కనిపించబోతున్నాడట.

చాలా సౌమ్యుడైన మధ్య తరగతి తండ్రిగా పోసాని కనిపిస్తాడట. ఈ పాత్రకి పోసాని కృష్ణమురళిని ఎంచుకోవడమే సర్‌ప్రైజ్‌ ప్యాకేజ్‌ అని చిత్రలహరి టీమ్‌ అంటున్నారు. పోసాని కనిపించగానే ప్రేక్షకులు ఒక తరహాలో ఎక్స్‌పెక్ట్‌ చేస్తారని, కానీ అందుకు విభిన్నంగా అతను కనిపించేసరికి షాక్‌ అవుతారని భావిస్తున్నారు. రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌ లాంటి నటులు చేయాల్సిన పాత్రని ఏరి కోరి పోసానితో చేయిస్తున్నారు. ఈ చిత్రంలో అతనిది కీలక పాత్ర అని, తండ్రీ కొడుకుల అనుబంధం నేపధ్యంలోనే ఈ చిత్రం సాగుతుందని సమాచారం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌లో కూడా పోసాని కనిపించలేదు. అతడిని తెరపై చూడగానే సర్‌ప్రైజ్‌ అయ్యేలా వుండాలనే అలా ప్లాన్‌ చేసారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English