రష్మిక లిప్ లాక్.. అడిగేవారు లేరిప్పుడు

రష్మిక లిప్ లాక్.. అడిగేవారు లేరిప్పుడు

సౌత్ ఇండియాలో ఇప్పుడు మోస్ట్ సక్సెస్ ఫుల్, అత్యంత క్రేజ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. అటు కన్నడలో, ఇటు తెలుగులో బ్లాక్ బస్టర్లతో దూసుకెళ్తోందామె. ముఖ్యంగా తెలుగులో ఆమె నటించిన ‘గీత గోవిందం’ ఎంత పెద్ద బ్లాకక్ బస్టర్ అయిందో.. ఆమెకెంత పేరు తెచ్చిందో తెలిసిందే. ఐతే ఆ సినిమా రిలీజ్ టైంలో కన్నడ జనాలు రష్మికను సోషల్ మీడియాలో తీవ్రంగా తిట్టిపోశారు.

అప్పటికి ఆమె కన్నడ నటుడు, నిర్మాత రక్షిత్ శెట్టితో రిలేషన్‌షిప్‌లో ఉండేది. అలా ఉంటూ ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం విజయ్ దేవరకొండతో లిప్ లాక్ చేయడాన్ని అక్కడి జనాలు తప్పుబట్టారు. సినిమాలో ఆ సన్నివేశం లేకపోయినప్పటికీ.. లీక్ అయిన ఓ సన్నివేశంలో మాత్రం లిప్ లాక్ కనిపించింది. ఏ ఉద్దేశంతో ఆ సీన్ సినిమా నుంచి తీసేశారో కానీ.. రష్మిక మాత్రం కన్నడ జనాల్లో బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకుంది.

కట్ చేస్తే.. రష్మిక రక్షిత్ నుంచి కొన్ని నెలల కిందటే విడిపోయింది. ఫ్రీ బర్డ్ అయిపోయింది. ఇప్పుడు ఆమెకు బ్రేకులు వేసేవాళ్లు లేరు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఏ భయం లేకుండా లిప్ లాక్ చేసేసింది రష్మిక. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త సినిమా ‘డియర్ కామ్రేడ్’ టీజర్ ఈ రోజే లాంచ్ అయింది. అందులో విజయ్-రష్మికల లిప్ లాక్ బాగా హైలైట్ అయింది. భలే రొమాంటిగ్గా ఈ షాట్ తీశాడు దర్శకుడు భరత్ కమ్మ. నిన్న టీజర్ లాంచ్ గురించి చెబుతూ.. రేపు టీజర్‌ను ఒకసారి చూసి వదిలి పెట్టరు మళ్లీ మళ్లీ చూస్తారని హింట్ ఇచ్చింది రష్మిక. ఆమె మాట నిజమే అవుతోంది. యూత్ మళ్లీ మళ్లీ ఈ టీజర్ చూసేలా చేస్తోంది ఆ లిప్ లాక్. ఈ రోజుల్లో లిప్ లాక్ అనేది కామన్ విషయం అయిపోయింది. కాకపోతే గత ఏడాది రక్షిత్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంటూ లిప్ లాక్ చేయడంతో జనాలు ఆమెను తప్పుబట్టారు. కానీ ఇప్పుడు రష్మికను ప్రశ్నించే వారెవరూ లేరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English