పాపం షారుఖ్.. అంత బాధలో ఉన్నాడా?

పాపం షారుఖ్.. అంత బాధలో ఉన్నాడా?

కింగ్ ఖాన్.. బాలీవుడ్ బాద్‌షా.. షారుఖ్ ఖాన్‌కు అభిమానులిచ్చిన బిరుదులివి. ఇవేమీ ఊరికే వచ్చేయలేదు. ఒకప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌లో షారుఖ్ ఆధిపత్యం ఆ స్థాయిలో సాగింది మరి. బాలీవుడ్లో ఓ సినిమా ఆడాలంటే అందులో సెక్స్ అయినా ఉండాలి.. లేదా షారుఖ్ అయినా ఉండాలి అంటూ జోకులు పేలేవి ఒకప్పుడు. అంతలా హవా నడిపించిన హీరో గత ఐదారేళ్లలో ఎంత దయనీయమైన స్థితిలో కొనసాగుతున్నాడో తెలిసిందే.

చిన్నా చితకా హీరోలు కూడా 100 కోట్లు.. 200 కోట్ల సినిమాలిస్తుంటే షారుఖ్ ఖాన్ చివరగా నటించిన 'జీరో' రూ.60 కోట్ల దగ్గర ఆగిపోయింది. షారుఖ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. షారుఖ్ హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. గత కొన్నేళ్లలో అతడి నుంచి వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్లే. ఐతే గత సినిమాలు ఎలా పోయినా కూడా 'జీరో' తన రాతను మార్చేస్తుందని.. ఈ సినిమా తనకు పూర్వ వైభవం తీసుకొస్తుందని ఖాన్ ఆశించాడు.

కానీ అలాంటిదేమీ జరగలేదు. ఈ సినిమా ఫలితం తర్వాత షారుఖ్ తీవ్ర నిరాశలో కూరుకుపోయాడట. ఇంతకుముందులా అతను మీడియా ముందుకు రావట్లేదు. వచ్చినా ఉత్సాహం కనిపించట్లేదు. తన ప్రొడక్షన్లో వచ్చిన 'బద్లా'ను పెద్దగా ప్రమోట్ చేయలేదు. అమితాబ్‌తో కలిసి ఒక వీడియో రిలీజ్ చేస్తే అందులోనూ చాలా డల్లుగా కనిపించాడు. ఖాన్ నిజంగా చాలా డిప్రెషన్లో ఉన్నాడని ప్రముఖ బాలీవుడ్ రచయిత అంజుమ్ రాజబలి తెలిపాడు. ఆయన షారుఖ్ నటించాల్సిన రాకేశ్ శర్మ బయోపిక్‌కు కథ అందించారు. ఈ చిత్రం నుంచి ఖాన్ చివరి నిమిషంలో తప్పుకున్న సంగతి తెలిసిందే. 'జీరో' బాగా ఆడి ఉంటే ఈపాటికి షారుఖ్ ఈ చిత్ర షూటింగ్‌‌లో పాల్గొంటూ ఉండేవాడట.

'జీరో' ఫలితంతో షారుఖ్ షాక్‌లో ఉన్నాడని.. ఇప్పుడున్న పరిస్థితిలో కొత్త సినిమాపై తాను ఫోకస్ పెట్టలేనని చెప్పడంతోనే మరో హీరోతో సినిమా చేయడానికి సిద్ధపడ్డామని అంజుమ్ తెలిపాడు. షారుఖ్‌ను ఇలాంటి స్థితిలో ఇంతకుముందెప్పుడూ చూడలేదని అంజుమ్ చెప్పాడు. షారుఖ్ స్థానంలోకి విక్కీ కౌశల్ లేదా రణబీర్ కపూర‌ను తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English