ఆమె కొడుకుని అతను ఆడిస్తుంటే..

ఆమె కొడుకుని అతను ఆడిస్తుంటే..

మోడర్న్ పీపుల్ మధ్య తిరిగేవాళ్లయినా.. సెలబ్రెటీలైనా సరే.. ఆల్రెడీ పెళ్లయి డైవర్స్ తీసుకున్న వాళ్లను పెళ్లి చేసుకోవడానికి కొంచెం ఆలోచించేవాళ్లు ఒకప్పుడు. అందులోనూ అవతలి వ్యక్తికి ఒక బిడ్డ కూడా ఉన్నపుడు పెళ్లి చేసుకుని ఆ బిడ్డతో మింగిల్ కావడం అంత చిన్న విషయం ఏమీ కాదు. ఐతే ఈ మధ్య ట్రెండు మారుతోంది. అంతకుముందున్న భాగస్వామి ద్వారా కన్న బిడ్డను పక్కన పెట్టుకుని అమ్మాయిలు మరో పెళ్లి చేసుకుంటున్నారు.

వచ్చే భాగస్వామి కూడా ముందున్న పిల్లలతో కలిసి పోయి సాఫీగా జీవితాన్ని గడిపేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విషయంలో ఇలాగే జరిగింది. శిరీష్ భరద్వాజ్ ద్వారా కన్న కూతురిని పక్కన పెట్టుకునే శ్రీజ పెళ్లి చేసుకుంది. ఆమె భర్త కళ్యాణ్ దేవ్ కూడా మెగా కుటుంబంలో బాగా కలిసిపోయాడు. శ్రీజ కూతురిని తన కూతురిగా చూసుకుంటున్నాడు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య విషయంలోనూ ఇలాంటి పరిస్థితే చూడొచ్చు. ఆమె ఒక పెళ్లి తర్వాత విడాకులు తీసుకుని విశాగన్ అనే వ్యక్తిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇద్దరూ హనీమూన్‌కు కూడా వెళ్లొచ్చారు. తాజాగా సౌందర్య ట్విట్టర్లో ఒక ఆసక్తికర ఫొటో జత చేసింది. సౌందర్య ముందు పెళ్లి ద్వారా కన్న కొడుకుతో విశాగన్ ఆడుకుంటున్న ఫొటో అది. చూడగానే అడోరబుల్ అనిపించే ఫొటో అది. దాన్ని షేర్ చేస్తూ.. ఇలాంటి దృశ్యం చూడటం వరం అని వ్యాఖ్యానించింది సౌందర్య. #MY BOYYS.. #GREATFUL.. #BLESSED.. #GODSAREWITHUS.. ఇలా చాలా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి తన ఆనందాన్ని పంచుకుంది సౌందర్య.

 ఎంత మోడర్న్ సొసైటీలో ఉన్నప్పటికీ.. సూపర్ స్టార్ తనయురాలైనప్పటికీ.. ఒక బిడ్డను కన్నాక మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ బిడ్డను వచ్చే వాడు ఎలా చూస్తాడో అన్న ఆందోళన ఉంటుంది. విశాగన్ ఏ ఫీలింగ్ పెట్టుకోకుండా కొడుకుతో ఆడుకునేసరికి సౌందర్య ఇలా ఉద్వేగానికి గురైనట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English