రాజమౌళి ఎప్పుడూ కాపీ కొట్టలేదా?

రాజమౌళి ఎప్పుడూ కాపీ కొట్టలేదా?

ఎంత పెద్ద దర్శకుడైనా ఏదో ఒక సినిమా చూసి ఇన్‌స్పైర్ అవడం.. ఏదో ఒక కాన్సెప్ట్ కాపీ కొట్టడం మామూలే. త్రివిక్రమ్ అంతటి పెద్ద దర్శకుడు ‘లార్గో వించ్’ అనే ఫ్రెంచ్ మూవీని డిట్టో దించేస్తాడని ఎవరైనా అనుకున్నారా? ఆయన వేరే సినిమాల్లో కూడా కాపీ అంశాలు కనిపిస్తాయి. ‘మగధీర’.. ‘ఈగ’.. ‘బాహుబలి’ లాంటి సినిమాలతో ఇండియాలో మరే దర్శకుడూ అందుకోని స్థాయిని అందుకున్న రాజమౌళి సైతం పలుమార్లు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కథలు.. సన్నివేశాలు.. పోస్టర్లు.. చాలా వాటి విషయంలో రాజమౌళిపై కాపీ ఆరోపణలొచ్చాయి. జక్కన్న తీసిన ‘మర్యాదరామన్న’ కాన్సెప్ట్ ఓ హాలీవుడ్ సినిమా నుంచి ఎత్తేసిందన్న సంగతి తెలిసిందే. అందులో ఎవరికీ ఏ సందేహాలూ లేవు.

రాజమౌళి కాపీ మూవీస్.. సీన్స్ అని యూట్యూబ్‌లోకి వెళ్లి కొడితే బోలెడన్ని వీడియోలు కనిపిస్తాయి. సాక్ష్యాలతో రాజమౌళి కాపీ ఐడియాల్ని చూపించేశారు వాటిలో. ఐతే నిన్నటి ‘ఆర్ఆర్ఆర్’ ప్రెస్ మీట్లో మాత్రం జక్కన్న తనకు కాపీ అలవాటే లేదన్నట్లుగా మాట్లాడాడు.  ఫిలిం మేకింగ్‌లో ఉన్నపుడు ఇలాంటి ఆరోపణలు సాధారణమైన విషయాలని.. లేనిపోనివి ఆపాదించి తనను బ్లేమ్ చేస్తుంటారు అన్నట్లుగా రాజమౌళి మాట్లాడాడు. రాజమౌళి ఈ విషయం చెబుతుండగా.. ఎన్టీఆర్ అందుకుని.. ‘ఔనా.. మీ మీద కాపీ ఆరోపణలు వచ్చాయా’ అంటూ ఆశ్చర్యపోయి అడిగాడు. అతను అడగడం.. రాజమౌళి సమాధానం చెప్పడం చూస్తే.. అసలు రాజమౌళి ఏంటి.. కాపీ కొట్టడమేంటి అని కలరింగ్ ఇస్తున్నట్లే అనిపించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English