సమంత పెద్ద షాకిచ్చింది

సమంత పెద్ద షాకిచ్చింది

‘కళ్యాణ వైభోగమే’ సినిమా తర్వాత మూడేళ్ల పాటు ఖాళీగా ఉండిపోయింది డైరెక్టర్ నందిని రెడ్డి. మధ్యలో ఆమె వేర్వేరు హీరోలను ట్రై చేసింది. ఒక దశలో యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ఆమె ఓ సినిమాకు రంగం సిద్ధం చేసుకుంది. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా ఇక మొదలవడమే అని చెప్పుకున్నారు. కానీ మధ్యలో ఏమైందో ఏమో.. ఆ సినిమా ముందుకు కదల్లేదు. కట్ చేస్తే సమంత ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి రెడీ అయింది నందిని.

కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు ముందే వార్తలు బయటికి వచ్చాయి. ఈ సినిమా రెండు నెలల కిందటే మొదలైంది. ఐతే ఈ సినిమా మొదలైనట్లుగా వార్తలొచ్చాయి తప్పితే.. ఆ తర్వాత షూటింగ్ గురించి ఏ అప్ డేట్ లేదు. సమంత తన భర్తతో కలిసి చేస్తున్న ‘మజిలీ’ గురించే ఎక్కువగా అప్ డేట్స్ వినిపించాయి ఈ రెండు నెలల్లో.

అసలు ‘మిస్ గ్రానీ’ రీమేక్ చిత్రీకరణ జరుగుతోందా లేదా అన్న డౌట్ కూడా కలిగింది. కట్ చేస్తే ఇప్పుడేమో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు అప్ డేట్ బయటికి వచ్చింది. సమంత, నందిని తమ టీంతో కలిసి ఫొటోలకు పోజిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు చాలా వరకు లేడీ టీమే పని చేయడం విశేషం.

ఈ ఫొటోలో కూడా అమ్మాయిలే ఉన్నారు. వీళ్లంతా కలిసి ఇంత వేగంగా ఈ సినిమాను పూర్తి చేయడం పెద్ద షాకే. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత సురేష్ బాబు నిర్మించాడు. ఆయన కొన్నేళ్లుగా లో బడ్జెట్ సినిమాలే చేస్తున్నారు. ‘మిస్ గ్రానీ’ రీమేక్‌ను కూడా తక్కువ బడ్జెట్లో.. తక్కువ రోజుల్లో చకచకా కానిచ్చేశారు. ఇందులో సమంత 80 ఏళ్ల ముసలావిడగా కనిపించనుండటం విశేషం. ‘మిస్ గ్రానీ’ ఓ వెరైటీ కథతో తెరకెక్కిన సినిమా. ప్రపంచ స్థాయిలో దానికి ప్రశంసలు దక్కాయి. మరి తెలుగులో ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English