జక్కన్న చెప్పిన ఆ మాటతో గూస్ బంప్స్

జక్కన్న చెప్పిన ఆ మాటతో గూస్ బంప్స్

నిన్నటి ‘ఆర్ఆర్ఆర్’ ప్రెస్ మీట్లో ఎన్నెన్నో హైలైట్లున్నాయి. ఐతే ఒక్క  చోట మాత్రం అందరిలో ఎక్కడలేని ఉద్వేగం కలిగింది. రాజమౌళి అన్న ఒక్క మాటతో అందరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మీద ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత పెరిగేలా చేసిన మాట అది. ముందు సినిమా ప్లాట్ గురించి జక్కన్న వెల్లడించాక.. విలేకరులు ఒక్కొక్కరే ప్రశ్నలు అడిగారు.

ఆ సందర్భంగా ఒక విలేకరి.. ‘‘అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ నిజ జీవితంలో సూపర్ హీరోలు కదా.. వాళ్ల గురించి చాలా గొప్ప చరిత్ర ఉంది కదా? మరి వాళ్ల గొప్పదనాన్ని తగ్గించకుండా సినిమా తీస్తారా’’ అని అడిగాడు. దీనికి జక్కన్న తనదైన శైలిలో జవాబిచ్చాడు. తాను మామూలుగానే సగటు హీరోల్ని చాలా హీరోయిగ్గా.. ఓ రేంజిలో చూపిస్తుంటానని.. అలాంటిది అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లాంటి నిజ జీవిత సూపర్ హీరోల్ని ఇంకెలా చూపిస్తానో మీరే ఊహించుకోండి అని జక్కన్న అన్నాడు.

ఈ మాట అనగానే అక్కడ కోలాహలం నెలకొంది. అందరూ గట్టిగా నవ్వుతూ.. చప్పట్లు కొట్టారు. ఈ వీడియో చూసిన వాళ్లకు కూడా హృదయం ఉప్పొంగింది. రాజమౌళి కెరీర్ ఆరంభం నుంచి కూడా చూసుకుంటే.. హీరోయిజాన్ని మామూలుగా ఎలివేట్ చేయడు. ‘సింహాద్రి’ సినిమా సమయానికే హీరోయిజాన్ని పీక్స్‌కు తీసుకెళ్లాడు. ఇక ‘బాహుబలి’ సినిమాకు వచ్చేసరికి ఎలివేషన్ ఏ స్థాయికి చేరుకుందో తెలిసిందే.

స్వయంగా రాజమౌళి ‘ఇందులో హీరోయిజం ఏ రేంజిలో ఉంటుందో ఊహించుకోండి’ అనే మాట అన్నాడంటే ఇక జనాలకు గూస్ బంప్స్ రాకుండా ఎలా ఉంటాయి? ఎన్టీఆర్, చరణ్ లాంటి ఇద్దరు మాస్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తూ.. రాజమౌళి తన స్థాయిలో వాళ్ల హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడంటే వ్యవహారం మామూలుగా ఉ:డదులే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English