ఎవరి డైసీ.. ఎవరీ డైసీ

ఎవరి డైసీ.. ఎవరీ డైసీ

నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి భారతీయ సినీ ప్రేక్షకుల నోళ్లలో నానుతున్న పేరు.. డైసీ ఎడ్గార్ జోన్స్. ఇప్పటిదాకా మన ఆడియన్స్ వినని పేరిది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సరసన కథానాయికగా నటించనున్న అమ్మాయి డైసీనే. జక్కన్న ఈ పేరు చెప్పగానే సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగిపోయింది. ఎవరీమె... ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుంది అంటూ ఇంటర్నెట్లో జనాలు తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఈ డైసీ ఎడ్గార్ జోన్స్ సంగతులేంటో చూద్దాం పదండి.

డైసీ బ్రిటన్‌కు చెందిన అమ్మాయి. ఆమె చేసిన సినిమా ఒక్కటే. గత ఏడాది ‘పాండ్ లైఫ్’ అనే సినిమాలో కాషీ అనే పాత్రలో నటించింది. ఐతే అంత కంటే ముందు ఆమె టీవీ సిరీస్‌లతో పేరు సంపాదించింది. ‘కోల్డ్‌ ఫీట్‌’, ‘వార్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌’, ‘జెంటిల్‌మాన్‌ జాక్‌’, ‘సైలంట్‌ విట్‌నెస్‌’, ‘ఔట్‌ నంబర్డ్‌’ తదితర టీవీ సిరీస్‌, టీవీ షోల్లో నటించింది. వీటితో పాటు ది రిలెక్టంట్ ఫండమెండలిస్ట్‌’లో నాటకంలోనూ, ‘వింటర్‌ సాంగ్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో కనిపించింది. ఐదేళ్ల వయసులోనే డైసీ నటనలోకి అడుగు పెట్టడం విశేషం. చదువుకుంటున్న రోజుల్లోనే ఓ నాటికలో అద్భుతంగా నటించి పేరు సంపాదించింది.

ఇంగ్లాండ్‌లోని నేషనల్‌ యూత్‌ థియేటర్‌లో 14 ఏళ్ల వయసులో డైసీ చేరింది. అక్కడ చోటు దక్కడం మామూలు విషయం కాదు. ది బెస్ట్‌ అనిపించుకున్న వారికే ప్రవేశం దక్కుతుంది. డైసీ తొలి ప్రయత్నంలోనే యూత్‌ థియేటర్‌లో సీటు సంపాదించింది. అక్కడ కోర్సు పూర్తి చేసుకుని బయటికి రాగానే డైసీకి టీవీ సిరీస్‌ల్లో అవకాశాలు వచ్చాయి. అవి మంచి పేరు తెచ్చాయి. పెద్దగా సినిమాలు చేయకుండా వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించింది. ఇప్పుడు ఎలాగో జక్కన్న కళ్లలో పడింది. ‘ఆర్ఆర్ఆర్’తో భారతీయ ప్రేక్షకుల్ని ఆమె మంత్రముగ్ధుల్ని చేయడం ఖాయమంటున్నారు తన టాలెంట్ తెలిసిన వాళ్లు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English