దేవరకొండ సినిమాకు తలపోటు

దేవరకొండ సినిమాకు తలపోటు

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ‘హీరో’ అనే కొత్త సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందటే ఈ టైటిల్ అనౌన్స్ చేశారు. ఐతే తర్వాతి రోజే ఈ టైటిల్ మీద వివాదం మొదలైంది. వీళ్లకు తెలిసి చేశారో.. తెలియక చేశారోో కానీ.. తమిళంలో ఆల్రెడీ ‘హీరో’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. శివ కార్తికేయన్ కథానాయకుడు. ఆ చిత్ర బృందం ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించిందా లేదా అన్నది తెలియదు.

విజయ్ సినిమా తెలుగు వరకే తెరకెక్కితే ఇబ్బందేమీ లేదు. కానీ ఆ చిత్రాన్ని నాలుగు దక్షిణాది భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు. తమిళంలో కూడా విజయ్‌కి మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ‘హీరో’ టైటిల్ విషయంలో క్లాష్ మొదలైంది. ఆల్రెడీ తమిళ మీడియా దీనిపై వార్తలు ప్రచురిస్తోంది. కానీ రెండు చిత్ర బృందాల నుంచి ఎవ్వరూ స్పందించలేదు.

‘హీరో’ టైటిల్‌తో తెలుగులో ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేశాడు. ఐతే ఆ సినిమా వచ్చి చాలా కాలం అయింది. యువ కథానాయకుడు నితిన్ సైతం ‘హీరో’ పేరుతో ఓ సినిమా చేశాడు. అది వచ్చింది వెళ్లింది తెలియదు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. తమిళ ‘హీరో’ టైటిల్ ముందే రిజిస్టర్ చేయించి ఉంటే మాత్రం విజయ్ సినిమాకు పేరు మార్చుకోక తప్పదు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్న ఆనంద్ అన్నామలై తమిళుడే.

మరి తమ ఇంసడ్ట్రీలో ‘హీరో’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అతడికి ఎందుకు తెలియలేదో ఏంటో మరి. ప్రస్తుతం విజయ్‌తో ‘డియర్ కామ్రేడ్’ సినిమా నిర్మిస్తున్న ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థే ‘హీరో’ను కూడా ప్రొడ్యూస్ చేయనుంది. ఇందులో విజయ్ క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. ఒక ఇన్‌స్పిరేషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English