రష్మీ.. మీ నాన్న నంబర్ మిస్సయింది

రష్మీ.. మీ నాన్న నంబర్ మిస్సయింది

సోషల్ మీడియాలో ఫాలోయింగ్ వల్ల సెలబ్రెటీలకు లాభాలతో పాటు నష్టాలూ ఉంటాయి. అందులోనూ అమ్మాయిలకు ఇక్కడ ఎన్ని హేట్ మెసేజ్‌లు వస్తాయో.. ఎంత చీప్, వల్గర్ కామెంట్లు చేస్తారో తెలిసిందే.

ఎలాగోలా టెంప్ట్ చేయించి వ్యక్తిగత సమాచారం రాబట్టడం ద్వారా సెలబ్రెటీల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించేవాళ్లు చాలామందే ఉంటారు. యాంకర్ కమ్ యాక్టర్ రష్మి గౌతమ్‌ను ఒక నెటిజన్ ఇలాగే బుట్టలో వేసే ప్రయత్నం చేశాడు. ఐతే అతను వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

తాజాగా రష్మికి ఓ వ్యక్తి నుంచి ట్విట్టర్లో ఒక ప్రతిపాదన వచ్చింది. "హేయ్ రష్మి.. ఓ యాడ్‌ షూట్‌ కోసం మిమ్మల్ని సంప్రదించాలని అనుకుంటున్నాను. మీ నాన్న నెంబర్‌ మిస్సయింది. ఏమీ అనుకోకపోతే నాకు మీ నాన్న నెంబర్‌ను పంపించండి" అని అతను మెసేజ్‌ పెట్టాడు. అనుమానం రాకుండా తన ట్విటర్‌ ఖాతాకు ‘పీఆర్‌ మేనేజ్‌మెంట్‌’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. మా నాన్న నంబర్ ఎందుకు.. నాదే తీసుకో అని రష్మిక అంటుందని అతడి అంచనా కావచ్చేమో.

 ఐతే రష్మి చిన్నప్పుడే తన తండ్రిని పోగొట్టుకున్న సంగతి అతడికి తెలియదు. ఆ నెటిజన్ అతి తెలివికి షాకైన రష్మిక.. తర్వాత తేరుకుని గట్టిగా పంచ్ ఇచ్చింది. ‘‘నాకు పన్నెండేళ్ల వయసున్నప్పుడే నాన్న చనిపోయారు. కాబట్టి మా నాన్న నెంబర్‌ నీ దగ్గర ఉండే అవకాశమే లేదు. ఇలా పీఆర్‌ మేనేజ్‌మెంట్ పేరుతో ఇతరులను ఫూల్‌ చేయాలని ప్రయత్నించకు. అమ్మాయిలతో మాట్లాడటానికి ఇదో కొత్త వంక అని నాకు తెలుసు. మీలాంటి వారి వల్లే ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోంది’’ అని ఘాటుగా సమాధానమిచ్చింది రష్మి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English