మాధవన్ డైరెక్షన్.. షారుక్, సూర్య క్యామియోస్

మాధవన్ డైరెక్షన్.. షారుక్, సూర్య క్యామియోస్

బహు భాషా నటుడు మాధవన్ ప్రస్తుతం ఓ ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్నాడు. శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఆ చిత్రం పేరు ‘రాకెట్రీ: నంబి ఎఫెక్ట్’. ఇందులో నంబి నారాయణన్ పాత్ర చేయడమే కాక.. స్వయంగా దర్శకత్వ బాధ్యతలు  కూడా నిర్వర్తిస్తున్నాడు మాధవన్.

ఈ చిత్రంలో ఇద్దరు సూపర్ స్టార్లు క్యామియో రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. వాళ్లే షారుక్ ఖాన్, సూర్య. దీన్ని దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్న మాధవన్.. ఇందుకోసమే షారుక్, సూర్యలను ప్రత్యేక పాత్రల కోసం తీసుకున్నాడట. ఈ సినిమా కోసం మాధవన్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఆ మధ్య అతడి లుక్ చూసి అందరూ షాకయ్యారు. గుర్తు పట్టలేని విధంగా తన అవతారాన్ని మార్చుకుని, మేకప్‌తో మ్యాజిక్ చేశాడు మాధవన్.

తమిళనాడుకు చెందిన నంబి నారాయణన్ గొప్ప శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. ఐతే ఆయన గొప్పదనాన్ని గుర్తించకపోగా.. దేశద్రోహం ఆరోపణలతో అతడిపై కేసు పెట్టి  జైల్లో కూడా వేయించారు అధికారులు. 56 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తనను జైల్లో పెట్టడం వల్ల ఇండియా ఎలాంటి మూల్యం చెల్లించుకుందన్నదే ఈ కథ. ముందు ఈ సినిమాకు అనంత్ మహదేవన్‌ను దర్శకుడిగా ప్రకటించారు.

ఆయన నంబి జీవితంపై, ఆయనకు సంబంధించిన కేసుపై కొన్నేళ్లుగా పరిశోధన జరుపుతున్నాడు. ఐతే అనంత్‌కు దర్శకుడిగా అనుభవం లేకపోవడంతో డైరెక్షన్ బాధ్యతల్ని మాధవన్ కూడా పంచుకుంటున్నాడు. మాధవన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదలవుతుంది. మాధవన్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాది చివర్లో ‘రాకెట్రీ: నంబి ఎఫెక్ట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English