సాయిధరమ్‌ తేజ్‌ బ్యాచ్‌ అంతా దిగిపోయారు!

సాయిధరమ్‌ తేజ్‌ బ్యాచ్‌ అంతా దిగిపోయారు!

సాయి ధరమ్‌ తేజ్‌ అవడానికి మెగా హీరోనే కానీ అందరితో కలివిడిగా వుంటాడు. యువ హీరోలు అందరితోను అతనికి మంచి రిలేషన్స్‌ వున్నాయి. చిన్న, పెద్ద హీరో అని తారతమ్యం లేకుండా అందరితోను కలిసిపోతాడు. అందుకే అతను వరుసగా ఫ్లాపులు చవిచూస్తూ వుండడంతో సాటి హీరోలంతా తేజ్‌ సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నారు.

'చిత్రలహరి' చిత్రంపై తేజ్‌ చాలా ఆశలు పెట్టుకోవడంతో ఈ చిత్రం సక్సెస్‌ అవడం కోసం అందరు హీరోలు తలా ఒక చెయ్యి వేస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌కి మాగ్జిమం రీచ్‌ వచ్చేలా చాలా మంది యువ హీరోలు తమ ట్విట్టర్‌ అకౌంట్స్‌ ద్వారా దీనిని ప్రమోట్‌ చేస్తున్నారు.

దీంతో అప్‌లోడ్‌ అయిన కొద్ది గంటల్లోనే ఈ టీజర్‌కి మిలియన్‌కి పైగా వ్యూస్‌ వచ్చాయి. వరుస వైఫల్యాలతో స్టార్‌డమ్‌ ఎఫెక్ట్‌ అయిందని తేజ్‌ వర్రీ అవుతున్నాడు. గతంలో అతని టీజర్లు చూస్తే అతడిని గ్లోరిఫై చేయడానికే ప్రాధాన్యమిచ్చేవి. కానీ చిత్రలహరిలో తాను కూడా ఒక పాత్ర పోషించాననే సంగతి అర్థమయ్యేలా తేజ్‌ చూసుకున్నాడు.

అతనిలో వచ్చిన మార్పు బాగా కనిపిస్తూ వుండడంతో మెగా ఫాన్స్‌ కూడా ఈ చిత్రంపై నమ్మకం చూపిస్తున్నారు. విపరీతమైన పోటీ వాతావరణంలో విడుదల కానున్న ఈ చిత్రానికి విడుదలకి ముందు కావాల్సిన అతి కీలకమైన పాజిటివ్‌ బజ్‌ని టీజర్‌ సాధించగలిగింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English