పవన్‌, చిరు ఫాన్స్‌ని ఒక తాటిపైకి...

పవన్‌, చిరు ఫాన్స్‌ని ఒక తాటిపైకి...

మెగా అభిమానులంతా ఒకటే అనేది పైమాటే. ప్రజారాజ్యం ఆవిర్భావం తర్వాత మెగా ఫాన్స్‌లో చీలిక వచ్చింది. అది పలు సందర్భాల్లో బహిర్గతమవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు రాజకీయంగా చిరంజీవి పాత్ర ఏమీ లేదు. ఇక ఆయనకి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు. కానీ పవన్‌కళ్యాణ్‌ మాత్రం తన భవిష్యత్తుని ప్రజాసేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో మెగా అభిమానుల మధ్య ఎలాంటి విబేధాలు లేకుండా అంతా ఒక తాటిపైకి రావాలి. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌కి అంత తీరిక లేదు. అభిమానులతో ఇంటరాక్ట్‌ అవడం, వారితో చర్చలు జరపడం జరిగే పని కాదు. నిజానికి అభిమానులతో పవన్‌కి ప్రత్యక్షంగా సంబంధ బాంధవ్యాలు లేవు. చిరంజీవి మాదిరిగా అభిమానులతో పవన్‌ కలవడు. అతడిని రీచ్‌ అవడం కూడా చాలా మంది అభిమానుల వల్ల కాదు. కానీ రాబోయే ఎన్నికల్లో జనసేనకి ప్రతి మెగా అభిమాని కావాలి. రాజకీయంగా పవన్‌తో విబేధించి వేరే పార్టీలకి మెగా ఫాన్స్‌ మద్దతు ఇస్తే పవన్‌కి చేటు జరుగుతుంది.

అందుకే ఫాన్స్‌ని ఒక తాటిపైకి తెచ్చేందుకే నాగబాబు రంగంలోకి దిగాడట. అభిమానులకి, మెగా హీరోలకీ వారధిగా నాగబాబు ఎప్పట్నుంచో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రత్యక్షంగా జనసేన రాజకీయ వ్యవహారాల్లో నాగబాబు పాల్పంచుకునేది లేదు కానీ ఫాన్స్‌ని ఏ కారణం చేత దూరం కానివ్వకుండా, జనసేనానికి వారు పూర్తి అండదండలు అందించే విధంగా నాగబాబు కృషి చేయనున్నాడు. అయితే నాగబాబు ఎంట్రీతో జనసేన కూడా ప్రజారాజ్యం బాట పడుతోందన్నట్టు ఇప్పటికే వ్యతిరేక మీడియా చ్కితీకరణ షురూ అవడంతో త్వరలోనే దీనిని నాగబాబు కౌంటర్‌ చేయనున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English