మహేష్‌ మీడియాతో సుక్కూ అన్‌హ్యాపీ

మహేష్‌ మీడియాతో సుక్కూ అన్‌హ్యాపీ

సుకుమార్‌తో మహేష్‌కి విబేధాలు వచ్చాయనేది బహిరంగ రహస్యం. తనతో సినిమా కోసం కథ సిద్ధం చేస్తూ అల్లు అర్జున్‌తో ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేసాడని మహేష్‌ హర్టయి సుకుమార్‌తో సినిమా కాన్సిల్‌ చేసుకున్నాడు. అయితే ఇదంతా జరిగిన తర్వాత మహేష్‌ని 'మహర్షి' సెట్స్‌లో కలిసి సుకుమార్‌ వివరణ ఇచ్చుకున్నాడు. తనని సంప్రదించకుండా తదుపరి చిత్రం గురించి అనౌన్స్‌మెంట్‌ ఇవ్వడం కరక్ట్‌ కాదని, అది రియలైజ్‌ అయ్యానని, కానీ అది అనుకోకుండా జరిగిపోయిందే తప్ప మహేష్‌ని చిన్నబుచ్చడానికి చేయలేదని సుకుమార్‌ చెప్పాడట. ఇద్దరి మధ్య వచ్చిన దూరం ఇలాంటి మిస్‌ అండర్‌స్టాండింగ్‌ వల్ల రాకూడదని, దానిని పోగొట్టుకోవడానికే సుకుమార్‌ కలిసాడట.

అయితే సుకుమార్‌ వెళ్లి మహేష్‌కి సారీ చెప్పాడని, మళ్లీ తనకి అవకాశమివ్వాలని బతిమాలుకున్నాడని, మహేష్‌ ఆలోచిద్దామని చెప్పాడని మీడియాలో వచ్చింది. ఇదంతా చూసి సుకుమార్‌ చాలా బాధ పడ్డాడట. ఎంతసేపు హీరో పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో, వాళ్ల ఈగో శాటిస్‌ఫై చేయడానికి, వాళ్లని గ్లోరిఫై చేయడానికే మీడియా చూస్తోందని, ఒక స్టార్‌ దర్శకుడిగా తనకి కనీస మర్యాద ఇవ్వడం లేదని, కనీసం తన వెర్షన్‌ కనుక్కునే ప్రయత్నం చేయకుండా తనని చిన్నబుచ్చేలా వార్తలు రాస్తోందని చాలా ఫీలయ్యాడట. ఇంతకీ విషయం ఏమిటంటే... మహేష్‌తో సుకుమార్‌ ప్రాజెక్ట్‌ ప్రస్తుతానికి లేనట్టే. అతనితో తీద్దామని అనుకున్న కథనే అల్లు అర్జున్‌కి చెప్పి అతడి నుంచి సుకుమార్‌ సమ్మతం పొందాడు. త్రివిక్రమ్‌తో బన్నీ సినిమా పూర్తయ్యేలోగా సుకుమార్‌ ఈ కథని సిద్ధం చేస్తాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English